సీఈవోను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

అమరావతి: ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కలిశారు. గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షలో కోడ్‌కు విరుద్ధంగా టీడీపీ పథకాలపై ప్రశ్నలు అడగడంపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. కోవూరు రీపోలింగ్‌ ముందు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోను ఎన్నికల ప్రధాన అధికారికి అందజేశారు.  ఈవీఎంలపై అనుమానాలు సృష్టించాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు చేశారు. ద్వివేదిని కలిసిన వారిలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఉన్నారు.
 

Back to Top