హైకోర్టు ఉత్తర్వులు చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు

ఎన్నికలను  శాంతియుతంగా జరపాలి

హైకోర్టు తీర్పు శుభపరిణామం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: హైకోర్టు ఉత్తర్వులు చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసురెడ్డి పద్మ అన్నారు.హైదరాబాద్‌లో వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల పరిధికి లోబడి ఉండాల్సిన అవసరం లేనట్లుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.  స్వేచ్ఛాయుతంగా,ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను జరిపేందుకు వీలులేకుండా చంద్రబాబు అడుగడుగున  అడ్డుపడినప్పటికి కూడా హైకోర్టు బాధ్యతయుతంగా ఉత్తర్వులు ఇవ్వడం ఏపీ రాష్ట్రానికి,ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. చంద్రబాబు..సీనియర్‌ పోలీసులను ఎన్నికల్లో అక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అనేకసార్లు వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదులు చేసిందన్నారు.

సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. విచారించి వివాదస్పదంగా ఉన్న ఇంటెలిజెన్స్‌ ఛీప్,ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని ఉత్తర్వులు ఇస్తే..సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు.హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కూడా విమర్శించిన చరిత్ర  చంద్రబాబుది అన్నారు.ఎన్నికలు బాధ్యతయుంగా జరగడానికి ఎన్నికల కమిషన్‌కు సహకరించాల్సింది పోయి..కత్తులు దూస్తున్నారన్నారు.డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తాజా వీడియోలు

Back to Top