చంద్రబాబుకు జైలు శిక్ష తప్పదు

నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించినా తప్పించుకోలేడు

ఉద్యమం పేరుతో రైతులను కవచంలా వాడుకుంటున్నాడు

ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చుతాడు

కృత్రియ ఉద్యమాన్ని నమ్మి రైతులు మోసపోవద్దు

టీడీపీకి రాష్ట్ర ప్రజలు 2019లోనే సమాధి కట్టారు

అమరావతి రైతులను సీఎం వైయస్‌ జగన్‌ అన్ని విధాలా ఆదుకుంటారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య

 

తాడేపల్లి:  ఊసరవెల్లి కంటే దారుణంగా రంగు మార్చే వ్యక్తి చంద్రబాబు. రాజధాని పేరుతో కృత్రిమ ఉద్యమం సృష్టించి రైతులను కవచంలా వాడుకుంటున్నాడు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. చంద్రబాబు కచ్చితంగా జైలుకుపోతాడు..  దీంట్లో అనుమానమే లేదు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య అన్నారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించినంత మాత్రాన చంద్రబాబు తప్పించుకోలేడన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని నమ్మి రైతులు మోసపోవద్దు అని సూచించారు. చంద్రబాబు ఆల్రెడీ సచ్చిపోయిన పాము అని, దాన్ని కొట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. పార్టీ ఉనికి కాపాడుకోవాలని చంద్రబాబు ఇలాంటి కృత్రియ ఉద్యమాలను సృష్టిస్తున్నాడన్నారు. చంద్రబాబు ఉచ్చులో రైతులు పడొద్దని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారన్నారు.
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీ.రామచంద్రయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘చంద్రబాబు ప్రజా నాయకుడు కాదు. మ్యానిపులేషన్స్‌తో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వ్యక్తి మాత్రమే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఒకసారి, వేరే పార్టీలతో పొత్తు కట్టి మరోసారి అధికారంలోకి వచ్చాడు తప్పితే.. ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసి ప్రజల మద్దతు కూడగట్టుకోలేదు.  మ్యానిపులేషన్స్‌తో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు.

అమరావతిలో తన, అనుచరులు దోచుకున్న భూముల ధరలు తగ్గుతాయని చంద్రబాబు ఉద్యమం చేస్తున్నాడు. నిజంగా రైతులపై ప్రేమతో కాదు. ఇంతకు ముందు పెయిడ్‌ ఆర్టిస్టులను వాడేవాడు.. ఇప్పుడు పెయిడ్‌ లీడర్స్‌ను తయారు చేసి హేతుబద్ధత లేని ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఈ రోజు మా పార్టీ అనుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్షనేత పదవి ఊడిపోతుంది. కానీ, మాకు ఆ అవసరం, ఆ అలవాటు, ఆ పద్ధతి లేదు. మా పార్టీలోకి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేయాలని మా నాయకుడు చెప్పారు. దానికే ఇప్పటికీ.. ఎప్పటికీ కట్టుబడి ఉంటాం.

ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టం కట్టారు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే కమిట్‌మెంట్లు ప్రభుత్వానికి ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఆయన అనుకున్నట్లే జరగాలనే తత్వం ఏంటో అర్థం కావడం లేదు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్యే.. కానీ, ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత బాబు ఆటలు సాగడం లేదు. రాజధాని రైతులు చంద్రబాబు నీచ రాజకీయ ఉచ్చులో పడకండి. మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి జగన్‌ చూసుకుంటారు. రాజధానుల విషయం రాష్ట్ర పరిధి అని.. మేము జోక్యం చేసుకోమని కేంద్రం క్లీయర్‌గా చెప్పింది.

రాజధానిని డిసైడ్‌ చేసి నోటిఫై చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా..? ఇంత రహస్యానికి కారణం ఏంటీ.. ఆ అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పార్లమెంట్‌లో ఇచ్చిన రిప్లయ్‌లో.. 2015లో నోటిఫై చేశామని ఆ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు మినిస్టర్‌ చెప్పారు. 2015లో అమరావతి రాజధానిగా టీడీపీ నోటిఫై చేస్తే ఆ అంశాన్ని ఎందుకు దాచిపెట్టావు. రాజధాని నోటిఫై చేసిన విషయం ప్రజలకు తెలియనివ్వకుంటే.. ఎన్ని నోటిఫికేషన్లు, ఎన్ని జీవోలు తెలియకుండా చేశావు చంద్రబాబూ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎప్పుడైనా రెఫరెండం పెట్టావా..? అమరావతిలో రాజధాని పెట్టడాన్ని గతంలో మేము వ్యతిరేకించాం. అప్పుడు రెఫరెండం పెట్టావా..? 2019లోనే చంద్రబాబుకు ప్రజలు రెఫరెండం ఇచ్చారు. లోకేష్‌ ఓడిపోవడం రెఫరెండం రిజల్ట్‌..

పది సంవత్సరాలు రాజధానిగా హైదరాబాద్‌ను వాడుకునే అవకాశం ఉంది. దాని తరువాత కూడా పదేళ్లు అడిగే అవకాశం ఉంది. 20 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయొచ్చు.. కానీ, ఎక్కడ జైల్లో వేస్తారని భయపడి పరిగెత్తుకుంటూ అమరావతి వచ్చాడు. రెండు రిపోర్టులు స్టడీ చేసి రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నాం. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి తనకు ఇష్టం వచ్చిన రిపోర్టు తయారు చేసుకొని అమరావతి రాజధాని అని డిసైడ్‌ చేశాడు. బాబుకు ఎవరు ఇచ్చారు ఆ అధికారం. చట్టాన్ని ఉల్లంఘించాడు ఇది రాజద్రోహం కాదా..? చంద్రబాబే తుగ్లక్‌. నాలుగు పంటలు పండే భూమిని నాశనం చేసిన చంద్రబాబు తుగ్లక్‌.

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఊసరవెల్లి కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక ప్రాంతంలోనే అభివృద్ధి అనేది కరెక్టు కాదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అధికారంలోకి వస్తే వికేంద్రీకరణ జరుగుతుందని స్పష్టంగా ముందే చెప్పాం. పొలాలు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు. చంద్రబాబు చెప్పే మాటలు విని మోసపోవద్దు. ఇది కృత్రిక ఉద్యమమే. ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి తనకు లాభం చేకూరేలా చేసుకున్నాడు. చంద్రబాబు కచ్చితంగా జైలుకు పోతాడు. దాంట్లో అనుమానమే లేదు. నలుగురు ఎంపీలను బీజేపీలకు పంపించినా.. నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు రైతులను రక్షణ కవచంగా వాడుకుంటున్నాడు. రైతుల కోసం పోరాడుతున్నట్లుగా మభ్యపెడుతున్నాడు. దయచేసి రైతులు మోసపోవద్దు.

తాజా వీడియోలు

Back to Top