అమ్మ ఒడితో సంక్రాంతి..ఉగాదికి ఇళ్ల పట్టాలు

పేదల గుండెల్లో నిలిచిపోయిన సీఎం వైయస్‌ జగన్‌  

 వైయస్‌ఆర్‌సీపీ నేత కారెం శివాజీ

తిరుమల : ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకంతో సంక్రాంతిని ప్రారంభించారని, ఉగాదికి ప్రతి పేదవానికి ఇళ్లపట్టాలు ఇచ్చి వారి గుండెల్లో నిలిచిపోతారని వైయస్‌ఆర్‌సీపీ నేత కారెం శివాజీ పేర్కొన్నారు.  సోమవారం కారెం శివాజి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి పక్షపార్టీలన్ని కూడా అసైండ్ భూము తీసుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడా కూడా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములు తీస్కోవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైయస్‌ఆర్‌ సీపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలకు పట్టం కట్టారని చెప్పారు. మూడు రాజధానులను అడ్డుకోడానికే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి సీఎం వైయస్‌ జగన్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరుతున్నామన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని, భ్రమరావతిగా  మార్చారన్న  సంగతి ప్రజలు గ్రహిస్తున్నార’ని శివాజీ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top