ప్రభుత్వానికి ఉన్న భూమిని పేదలకు ఇస్తే తప్పేంటి.

ఆర్ -5 జోన్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు సంతోషాన్ని ఇచ్చాయి.

 పేదలకు ఇంటి స్ధలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం అన్యాయమైన చర్య.

 రాజధానిలో పేదలు వద్దని చెబుతున్న తెలుగుదేశం నేతలు రేపు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు.

జిఓ 1 విషయంలో నూతన చట్టం తేవడం జరుగుతుంది.

మీడియాతో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

తాడేప‌ల్లి:  అమరావతిలో పేదల భూముల ఆర్‌5 జోన్‌ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు,  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  

     రాజధాని అమరావతిలో పేదలు వద్దు అంటున్న తెలుగుదేశం పార్టీ,ఆ పార్టీ నేతలు  రేపు ఏ ముఖం పెట్టుకుని  ఓట్లు అడుగుతారో చెప్పాలని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పేదలకు స్థలాలు ఇస్తుంటే అడ్డుకోవడం అన్యాయమైన చర్య అని అలాంటి ఆలోచన ఎవరికి రాకూడదు. ఇది దుర్మార్గమైన ఆలోచన ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాకూడదు. దుర్మార్గమైన ఆలోచన టిడిపి అండ్ కో కి వచ్చింది. సుప్రీం కోర్టుకు పోవడం బరితెగింపునకు నిదర్శనమని తెలియచేశారు. ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్ ఎవరికి ఇవ్వాలని ప్రభుత్వం ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ భూమి అయిన తరువాత అవసరాన్ని బట్టి దానిని వాడుతుంది. ఎవరిపైనా కక్షతో చేసింది కాదు...రాజధానిలో అందరూ ఉండాలని చేశామని తెలియచేశారు. ప్రతిపక్షాల తీరు చాలా అన్యాయంగా ఉందన్నారు.ఒక రాజకీయపార్టీగా తెలుగుదేశం పార్టీ తన అర్హత కోల్పోయిందన్నారు. ఆర్ -5 జోన్ విషయంలో చూస్తే దీనిని ప్రతిపక్షాలు ఒక వివాదంగా మార్చడం దారుణంగా ఉంది. గుడిలో లింగాన్ని,మట్టిని అన్నింటిని మింగేయాలని చంద్రబాబు భావించారు. ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు సంతోషాన్ని ఇచ్చాయన్నారు.

     ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టుల్లో కేసుల కోసం కోట్లరూపాయలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు రైతులా.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు...ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు నాయకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చిన వారికి ఉన్న హక్కులే వీరికి కూడా ఉంటాయి. ఇది కేవలం ఓట్లు కోసం చేసింది కాదన్నారు. చుట్టుపక్కల నగరాల వారికి ఇవ్వడానికి రాజధానిలోఅందుబాటులో ఉంది కనుక ఇవ్వడం జరిగింది.

       ప్రపంచంలో ఎక్కడైనా సరే అభివృద్ధిలో పేదవర్గాలకు, శ్రామికులు భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. రాష్ర్టంలో 30 లక్షలమంది పేదలకు ఇంటి స్ధలాలు ఇచ్చాం.వాటిలో ఇంటి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేస్తున్నది పేదల వైపు యుద్ధం అని అన్నారు. పేదల పక్షాన నిలబడిన వ్యక్తి సీఎం శ్రీ వైయస్ జగన్ అని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఉన్నప్పటికి పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు పేదలను విస్మరించి పెద్దలకు మాత్రమే మేలు చేశాడని విమర్శించారు.

      పవన్ ట్వీట్స్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అది చిల్లరి తనంగా అభివర్ణించారు. పవన్ కల్యాణ్ వి తెలిసీ తెలియని మాటలు. అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని అన్నారు.

      జిఓ 1 గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జీఓ 1 అమలు చెయ్యడానికి వీలు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. ఇంకొక చట్టం తీసుకురమ్మని చెప్పిందని అన్నారు. కొత్త చట్టం త్వరలో వస్తుందని దీనికి సంబంధిం

Back to Top