అధైర్య ప‌డొద్దు..వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే

వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి

తిరుప‌తి జిల్లా:  ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా అధికారంలోకి వ‌చ్చేది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, ఎవ‌రూ అధైర్య ప‌డొద్ద‌ని వెంక‌ట‌గిరి వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాల‌ని, మన ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత‌ ఒకటికి రెండింతలు తిరిగి ఇచ్చేద్దామ‌న్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి  90వ జ‌యంతి సందర్భంగా భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి చెప్పిన విధంగా 2.O చూడబోతున్నామ‌న్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్ర‌తి ఒక్క‌రిని గుర్తు పెట్టుకుంటామ‌ని, అన్నింటిలో త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. 

Back to Top