ప్ర‌జ‌ల ప‌క్షం.. వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యం

అధికార‌మైనా, ప్ర‌తిప‌క్ష‌మైనా ప్ర‌జ‌ల అభిమ‌త‌మే ధ్యేయం

రేపు వైయ‌స్ఆర్‌సీపీ 15వ ఆవిర్భావ దినోత్స‌వం 

తాడేప‌ల్లి: స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ..మార్చి 12, 2011న ఇడుపుల‌పాయ‌లో ఒక్క‌డితో ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్ర‌భంజ‌నంలా మారింది. ఎన్ని శ‌క్తులు ఏక‌మై కుట్ర‌లు ప‌న్నినా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు . మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌తో ప్ర‌జ‌లకు ద‌గ్గ‌రైంది. ప్ర‌తిప‌క్షమైనా, అధికార ప‌క్ష‌మైనా ప్ర‌జ‌ల అభిమ‌త‌మే ధ్యేయంగా ప‌ని చేస్తోంది. ఎన్ని పార్టీలు ఏక‌మై వ‌చ్చినా..ప్ర‌జాబ‌లంతో వైయ‌స్ జ‌గ‌న్ ఒక్కే ఒక్క‌డిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌..2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి.. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చేపట్టిన ధర్నా వంటి కార్యక్రమాల‌తో ప్ర‌జాభిమానాన్ని కూడ‌గ‌ట్టారు.

చరిత్రాత్మకంగా ప్రజా సంకల్ప యాత్ర
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6న ప్రజాసంకల్ప పాదయాత్రను వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో.. మండుటెండలో.. కుంభవృష్టిలో 14 నెలలపాటు 3,648 కి.మీ.  దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. అన్నిచోట్లా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ 2019 ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాలను కట్టబెట్టారు. 

Bleak days have gone for downtrodden with Jagan coming to power' - The Hindu

సామాజిక విప్ల‌వానికి శ్రీ‌కారం
2019 మే 30న ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. 2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించారు. దీంతో వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది.  

తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమ‌లు
అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ వారికి బాసటగా నిలిచారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన వైయ‌స్‌ జగన్‌… విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత, మహిళాసాధికారతకు పెద్దపీట వేసేలా ముందుకు సాగారు. 

పోరుబాట
2024లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అన్న‌దాత‌ల‌కు అండ‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప‌ట్టింది. 2024, డిసెంబ‌ర్ 13న రైతుల స‌మ‌స్య‌ల‌పై  నిరసన తెలుపుతూ.. కలెక్టర్‌కి వినతిపత్రం  అందించింది. ఈ క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను కూట‌మి స‌ర్కార్ అడ్డుకోవాల‌ని కుట్ర‌లు చేసింది. అలాగే డిసెంబ‌ర్ 27న  విద్యుత్ చార్జీల పెంపును నిర‌సిస్తూ పెద్ద ఉద్య‌మ‌మే చేప‌ట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజలపై దుర్మార్గంగా మోపిన రూ.15,485 కోట్లు విద్యుత్‌ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వ‌హించారు.  అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ పోరుబాటలో స్వచ్ఛందంగా పాల్గొని, ప్రభుత్వ నిర్ణయంపై తమ అసంతృప్తి బహిర్గతం చేశారు. 

Sujay Krishnasold himself to TDP: Jagan - The Hindu
12న `యువ‌త పోరు`
కూట‌మి పాల‌న‌లో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్దులను వెళ్ళగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది.   నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తానంటూ ఇచ్చిన హామీ ఏమయ్యింది? ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఈ నెల 12న వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో యువ‌త పోరు కార్య‌క్ర‌మానికి వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు యువ‌త‌, విద్యార్థులు సిద్ధ‌మ‌య్యారు.

 

రేపు పల్లెపల్లెలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు : వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

`ఈనెల  12వ తేదీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్రంలోని ప‌ల్లె ప‌ల్లెలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి.  ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి` అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు 

02.09.2009 : మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్ట్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం
09.04.2010:  ఓదార్పు యాత్ర ప్రారంభం
27.11.2010 : తమ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టారనే అక్కసుతో వైఎస్‌ జగన్‌ ఆస్తులపై విచారణ జరపాలని లేఖలు రాసిన కాంగ్రెస్, టీడీపీ 
29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ జగన్, వైయ‌స్‌ విజయమ్మ రాజీనామా
21.12.2010: రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్‌తో విజయవాడ కృష్ణా నదీ తీరాన వైయ‌స్‌ జగన్‌ ‘లక్ష్య దీక్ష’  
11.03.2011: వైయ‌స్ఆర్‌సీపీ పేరు ప్రకటించిన వైయ‌స్‌ జగన్‌
12.03.2011: ఇడుపులపాయలో వైయ‌స్‌ సమాధి వద్ద  వైయ‌స్ఆర్‌సీపీ పతాకం ఆవిష్కరణ, పార్టీ ఏర్పాటుపై ప్రకటన
13.05.2011: కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వైయ‌స్‌ జగన్‌ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వైయ‌స్‌ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి.
08.07.2011:ఇడుపులపాయలో వైయ‌స్ఆర్‌సీపీ తొలి ప్లీనరీ
10.08.2011: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు చేసిన ఫిర్యాదులు ఆధారంగా వైయ‌స్‌ జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు.
21.08.2011: వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతూ కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు 19 మంది రాజీనామా. నెల్లూరు లోక్‌సభ స్థానానికి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా.
27.05.2012: టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ
14.06.2012:  ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం
21.12.2012: అక్రమ కేసులపై ‘జగన్‌ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ
24.09.2013: అక్రమ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన వైయ‌స్‌ జగన్‌
05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్‌ పాండ్‌లో వైయ‌స్‌ జగన్‌ ఆమరణ దీక్ష 
18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం
16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్‌సభ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం
20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైయ‌స్‌ జగన్‌కు గుర్తింపు
21.02.2015: అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన వైయ‌స్‌ జగన్‌
10.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైయ‌స్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నా 
29.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర బంద్‌ 
26.01.2017:  విశాఖ ఆర్కే బీచ్‌లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైయ‌స్‌ జగన్‌ను రన్‌ వేపైనే అరెస్టు చేసిన పోలీసులు
01.05.2017: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో గుంటూరులో వైయ‌స్‌ జగన్‌ రైతు దీక్ష 
08.07.2017:  నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న మైదానంలో వైయ‌స్ఆర్‌సీపీ రెండో ప్లీనరీ
26.10.2017: వైయ‌స్ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయకపోవడాన్ని, శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసిన వైయ‌స్‌ జగన్, వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్యేలు.
06.11.2017:ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం
25.10.2018: విశాఖ ఎయిర్‌పోర్టులో వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం
09.01.2019: శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు
23.05.2019: ఎన్నికల్లో ఘన విజయం
30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం  
13.12.2024:  రైతుల స‌మ‌స్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట‌
27.12.2024:  పెంచిన విద్యుత్ చార్జీలు త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా స‌బ్ స్టేష‌న్ల ఎదుట ధ‌ర్నా
12.03.2025:  యువ‌త పోరు కార్య‌క్ర‌మం..అన్ని జిల్లా కేంద్రాల్లో క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మాలు

Image
 

Back to Top