చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు

ఎ్రరగొండపాలెంలో వైయస్‌ విజయమ్మ

న్యాయానికి..అన్యాయానికి మధ్య యుద్ధం

విలువలకు, విశ్వసనీయతకు పట్టంగట్టండి

వైయస్‌ఆర్‌ పథకాలను గుర్తు చేసుకోండి

సాగు, తాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

బాబు పాలనలో రైతులకు కనీస మద్దతు ధర కూడా లేదు

ప్రకాశం: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి భద్రత ఇవ్వలేని వ్యక్తి..మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మీ భద్రత– నా బాధ్యత అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ పథకాలను గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె సూచించారు. ప్రకాశం జిల్లా ఎ్రరగొండపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే..

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిని హృదయంలో పెట్టుకున్న ప్రతి హృదయానికి, జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరుపేరునా అభినందనలు. ఎన్నికలు రానే వచ్చేసాయి. కేవలం 11 రోజులు మాత్రమే ఉన్నాయి,అందరూ రాజశేఖర్‌రెడ్డి పాలన గుర్తుచేసుకోవాలి.ఆయన పెట్టిన ప‌థ‌కాల‌ను గుర్తుచేసుకోవాలి.ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్‌మెంట్, 108,104,రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్,గిట్టుబాటు ధరలు,పావలా వడ్డీరుణాలు,మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్లు అన్ని గుర్తుచేసుకోవాలి. న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి.చంద్రబాబు పాలనలో విలువలు,విశ్వసనీయత లేవని, మోసం,అబద్ధం రాజ్యమేలుతోంది.నాయకుడు చేసేది చెప్పాలన్నారు.వైయస్‌ఆర్‌ గతంలో ప్రజలకు చెప్పింది.చెప్పనిది అన్ని చేసి ప్రజలను  ఓటు అడిగారని తెలిపారు.

చంద్రబాబు ఏంచేశారని ఓటు అడుగుతారు.ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా.ప్రజలకు,వైయస్‌ఆర్‌ కుటుంబానికి నలభై సంవత్సరాల అనుబంధం.వైయస్‌ఆర్‌ను  30 సంవత్సరాలు భుజస్కందాలపై మోసి సీఎంను చేసుకున్నారు.ఆయన కూడా గుండెల్లో పెట్టుకున్నారు.నిరంతరం ప్రజా సంక్షేమమే కోరుకున్నారు.జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ఓదార్పు యాత్ర చేశారు.మాటకోసం నిలబడి ఉన్నారు.ఆనాడు జగన్‌ ఓదార్పుయాత్ర కాంగ్రెస్‌ పార్టీకి నచ్చలేదు..ప్రజల చూపించిన ఆదరణ కాంగ్రెస్‌ పార్టీకి నచ్చలేదు.ఓదార్పు యాత్రలో ప్రజలు వైయస్‌ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు.ప్రజల ఆదరణ ఎప్పుడూ మరవలేం. వైయస్‌ కుటుంబం ప్రజలకు రుణపడి ఉంటుంది.వైయస్‌ జగన్‌ ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారు.రాష్ట్రం సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశారు.ప్రభుత్వానికి కొంచెమైనా కనువిప్పి కలిగించారు.

రాజశేఖర్‌రెడ్డి బతికున్న రోజుల్లో ఎన్నడూ బయటకు రాలేదు.వైయస్‌ఆర్‌ మరణం అనంతరం వైయస్‌ జగన్‌పై అన్యాయంగా,అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు,మా కోసం నమ్మకంగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం బయటకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు ఎప్పడూ ప్రజలే కుటుంబంగా భావించేవారు.ప్రజలంతా మా కుటుంబమే. చంద్రబాబు ఏం చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడు. 40 సంవత్సరాలు అనుభవం ఉంది.రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.650 వాగ్ధానాలు చేసి మోసం చేశాడు.ఐదుమాఫీలు చేస్తానని చెప్పారు.చేశారా..వైయస్‌ఆర్‌ హయాంలో రైతుల రుణమాఫీ,ఉచిత విద్యుత్,కరెంటు బకాయిల మాఫీ,గిట్టుబాటు ధరలు,రైతులకు బీమా వంటి అన్నిరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.చంద్రబాబు హయాంలో రైతులకు బీమా కూడా ఇవ్వలేదు.కనీసం మద్దతు ధరలు కూడా ఇవ్వలేదు.ప్రాజెక్టులు కూడా పూర్తిచేయలేదు.వైయస్‌ఆర్‌ వెలుగొండ ప్రాజెక్టు మొదలుపెట్టి సుమారు 70 శాతం పూర్తిచేశారు.ఆయన మరణం అనంతరం ఆగిపోయింది.మిగిలిన పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తిచేసిందా..ఈ జిల్లాకు 16 సార్లు చంద్రబాబు వచ్చాడు..పదహారు ఇంచులు కూడా కదలేదు.

ఈ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఎంతో మంది వలసలు పోతున్నారు.తాగునీరు,సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు చాలామంది ఉన్నారు. టీడీపీ నేతలకు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని ఆలోచన చేయడమే తప్ప వారికి న్యాయం చేయాలనే ఆలోచన లేదు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని మాట ఇస్తున్నా..వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తిచేస్తాం. సాగునీరు,తాగునీరు సమృద్ధిగా ఇస్తాం..సాగర్‌ కాల్వ ఈ జిల్లాలో పారుతున్న చుక్క నీరు ఇవ్వడంలేదు.చంద్రబాబు ఈ జిల్లాకు ఏం చేశారు.ఒకసారి ప్రజలు ఆలోచించాలి.రైతులకు 25వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు..నేడు లక్షా 50వేల కోట్లకు రుణం పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమయ్యింది.రైతులకు కనీసం భద్రత,భరోసా కల్పించలేకపోతున్నారు.డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు 14వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు.నేడు ఆ రుణం 25 వేల కోట్ల రూపాయలు అయ్యింది.పసుపు–కుంకుమ ఇస్తున్నారా..వైయస్‌ఆర్‌ హయాంలో మహిళలకు పావలా రుణాలు ఇచ్చారు.అన్ని రకాలుగా మేలు చేశారు.

నేడు చంద్రబాబు హయాంలో జరుగుతున్నాయా..మీకు భద్రత ఇస్తున్నారా.రెండు రూపాయలకే 20 లీటర్ల నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.ఇస్తున్నారా..బార్‌ షాపులను రద్దుచేస్తానని చెప్పారు.రద్దు చేశారా.. నీళ్లు దొరకడంలేదు కాని, మద్యం దొరుకుతుందన్నారు.ఇదేనా మీ భవిష్యత్‌కు భదత్ర.. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్‌ఆర్‌ ఆసరా–చేయూత ద్వారా ప్రతి అక్క,చెల్లెమ్మను లక్షాధికారిని చేస్తారు. ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తారు. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మద్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం.

జలయజ్ఞం ద్వారా  పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను జగన్‌ పూర్తిచేస్తారు. చంద్రబాబు పాలనలో ఆరోగశ్రీ హైదరాబాద్‌లో కూడా వర్తించడంలేదు.ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయగా.ఎన్టీఆర్‌ సేవ పేరుతో 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు.ఆసుప్రతులకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా నేటివరుకు ఇవ్వలేదు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన మంచి వైద్యం అందిస్తారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత  1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తారు. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలనెలా ప్రత్యేకంగా పింఛను ఇచ్చే ఏర్పాటు చేస్తాం. వైయస్‌ఆర్‌ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు చదువుకున్నారు.

నేడు చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుందా..ఏ కాలేజిలు చూసిన ప్రభుత్వం డబ్బులు చెల్లించంలేదని చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేశారు. చదువుకి ఎవ్వరికి పేదరికం అడ్డు కాకుడదు..జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత చదువులు చదివిస్తాం.నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం.వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అమ్మఒడి పథకం ద్వారా మీ పిల్లల్ని బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం. 

వైయస్‌ఆర్‌ హయాంలో దేశమంతట 48 లక్షల ఇళ్లు కట్టితే..మన రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు నిర్మించారు. నేడు చంద్రబాబు నాయుడు ఇళ్లు కట్టించకపోయిన  ఇళ్లు కట్టించానని చంద్రబాబు చెబుతున్నారు.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు,కులాలు,మతాల,వర్గాలకు అతీతంగా పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తాం.ప్రతి ఇల్లు అక్కచెల్లెమ్మల పేరు మీదే రిజిష్టర్‌ చేయిస్తాం.ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేకహోదాపై చంద్రబాబుపై యూటర్న్‌ తీసుకున్నారు.ప్రత్యేకహోదా వద్దు. స్పెషల్‌ ప్యాకేజీ ముద్దు అన్నారు.వైయస్‌ జగన్‌ పోరాటాలు చేస్తేగాని చంద్రబాబుకు ప్రత్యేకహోదా గుర్తుకు రాలేదు.సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు. 

Back to Top