అమరావతి: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.