సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ

సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: మార్కెట్‌ రేటు కన్నా తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలపై చర్చించారు. మార్కెట్‌ రేటు కన్నా తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, ఇసుక సప్లయ్‌ పెంచాలని, స్టాక్‌ యార్డుల్లో ఇసుక నింపడం మొదలుపెట్టాలని, అవకాశం ఉన్న ప్రతి చోట ఇసుక రీచ్‌లను పెంచాలని ఆదేశించారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక రవాణాలో కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. మనం ప్రజలకు మంచి చేస్తే చూడలేక బాధపడేవాళ్లు ఉన్నారన్నారు.

 

Back to Top