తాడేపల్లి: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. `భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.