నంద్యాల‌లో టీడీపీకి షాక్‌

34వ వార్డులో టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన యువ‌కులు 

నంద్యాల‌:  నంద్యాల ప‌ట్ట‌ణంలో తెలుగు దేశం పార్టీకి షాక్ త‌గిలింది. నంద్యాల పట్టణం 34వ వార్డు వెంకటాచలం కాలనీ నుంచి మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఆద్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో యువత టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ సొంత గూటికి చేరారు. వీరందరికి శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... నాడు వీరంతా వైయ‌స్ఆర్‌ సీపీలో ఉన్న యువకులు నేడు తిరిగి తమ గూటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధికి ఆకర్షితులైన వీరంతా పార్టీ భలోపేతానికి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి విజయానికి కృషిచేయాలని కోరారు. ఈనెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభను విజయవంతం చేయాలని మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. యువతే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపైనర్లని కితాబిచ్చారు.  శేఖర్, నరసింహలు, చింటు, రఫీ, పక్షా, శివ, శ్రీనాథ్, వంశీ వారి మిత్రబృందం, కుటుంబ సభ్యులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

Back to Top