సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయంపై హర్షం

విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించిన నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఎంపిక చేయడంపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ పార్కు హోటల్‌ జంక్షన్‌ నుంచి ఆర్కే బీచ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్కు హోటల్‌ జంక్షన్‌ నందు ఉన్న దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మొదలైన ర్యాలీ ఆర్కే బీచ్‌ వరకు సాగింది. బీచ్‌ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అదీప్‌రాజు, డి.శ్రీనివాస్, నాయకులు వంశీకృష్ణ, కుంభ రవిబాబు, కొయ్య ప్రసాదరెడ్డి, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top