గ్రాఫిక్స్‌ లేవు..గాలి వార్తలు లేవు

 వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: గ్రాఫిక్స్ లేవు. గాలి వార్తలు లేవు. పనులు జరుగుతున్నాయిక్కడ అంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు . కరోనా నియంత్రణలోనే కాక, టెస్టింగ్, చికిత్స పరికరాల ఉత్పత్తిలో దేశానికే మార్గదర్శకం కాబోతోంది రాష్ట్రం. పది నెలలే అయింది. ఇంకా నాలుగేండ్లలో చాలా వండర్స్ చూడాలి. గుండె దడ రాకుండా చూసుకోవాలి కుల మీడియా, దాని బాసు అంటూ ట్వీట్‌ చేశారు.

కమిషన్ల కోసం ప్రజారోగ్య వ్యవస్థను బలి చేశాడు
ఐదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించాడని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  వాటిపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తుంగలో తొక్కాడు. ఆరోగ్య శ్రీ కార్డులు ఇతర రాష్ట్రాల్లో చెల్లకుండా చేసి రోగుల ఉసురు తీశాడు. కమిషన్ల కోసం ప్రజారోగ్య వ్యవస్థను బలి చేశాడని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top