రాజ్యసభ వైస్‌ చైర్మన్ ప్యానెల్‌కు విజయసాయిరెడ్డి ఎంపిక‌

రాజ్యసభలో ప్రకటించిన చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌

న్యూఢిల్లీ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం.. రాజ్యసభ సభాపతి స్థానంలో కూర్చునే  ఛాన్స్‌ లభించింది. రాజ్యసభ  వైస్ ఛైర్మ‌న్ ప్యానెల్ స‌భ్యుడిగా విజ‌య‌సాయిరెడ్డి ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం స‌భ‌లో చైర్మ‌న్ జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ ప్ర‌క‌టించారు. వైస్‌ చైర్మన్ ప్యానెల్ స‌భ్యుడిగా ఎంపికైన విజయసాయిరెడ్డిని ఎంపీలు అభినందించారు. తొలిసారి నామినేటెడ్‌ ఎంపీకి  వైస్‌ చైర్మన్ ప్యానెల్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ,  చైర్మ‌న్ జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖ‌ర్, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top