తాడేపల్లి: మర్డర్ కేసులో టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అరెస్టుఅయితే చంద్రబాబు రచ్చ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. హత్యకు గురైన భాస్కర రావు బీసీ కాదా? బాధితునికి న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీ మహిళల ధర్నాలు కనిపించడం లేదా?..'మర్డర్ కేసులో ఒక టీడీపీ నాయకుడు అరెస్టైతే బీసీలపై దాడంటూ అర్థ రాత్రి ఫోన్లు చేసి రచ్చ చేస్తున్నాడు నాయుడు బాబు. ప్రతిదానికి కులం కార్డు ఏంటి బాబు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు అంతా పారదర్శకమే చంద్రబాబు హయాంలో ప్రతిదీ వ్యాపారమేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు ఏం వస్తుంది, తన వాళ్లకు ఏం లాభమనేదే ఆయన ఆలోచన అని చెప్పారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్టుల నుంచి మందుల సరఫరా వరకు అంతా తన వాళ్లే దోచుకునేలా నిర్ణయాలు ఉండేవని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానం వల్ల ఇప్పుడు అంతా పారదర్శకంగా ఉందని... ప్రతి రూపాయికి లెక్క తెలుస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు.