చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడు

వైయస్‌ఆర్‌  సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడని వైయస్‌ఆర్‌  సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.  తన స్వార్థం కోసం, బినామీల కోసం అందరూ వీధుల్లోకి రావాలట. నేను పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇళ్లలో కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడేమో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సచివాలయం ఉద్యోగులు సంక్రాంతి సెలవులు తీసుకోకుండా విధుల్లోకి రావాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 'ఈయన ఆస్తుల ధర పడిపోకుండా అంతా అడ్డం నిల్చోవాలట' అంటూ ఎద్దేవా చేశారు.ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

Back to Top