వైయస్‌ జగన్‌ అంటే ప్రజలకు ఓ నమ్మకం

చంద్రబాబులా ప్రశ్నించిన వారిని సీఎం గదమాయించలేదు

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే ప్రజలకు ఓ నమ్మకమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన పూర్తి అయిన సందర్భంగా బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. 
వరద ప్రభావం కొనసాగుతుండగానే సీఎం వైయస్‌ జగన్‌ పర్యటించారని  చెప్పారు. రాజోలు వెళ్లే వరకు అక్కడి నుంచి తిరిగి వచ్చే వరకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇందులో అర్థమైంది ఏంటంటే..వైయస్‌ జగన్‌ అంటే ప్రజలకు ఓ నమ్మకమన్నారు. రాజకీయాలు అంటేనే ప్రజలకు ఓ నమ్మకం కలిగించాలి. చంద్రబాబు కేవలం అబద్ధాలను ఎజెండాగా పెట్టుకొని వరద ప్రాంతాల్లో రాజకీయ యాత్ర చేపట్టారు. సోషల్‌ మీడియాలో తేడా కనిపించింది. వైయస్‌ జగన్‌ వెళ్తే ప్రజలు ఎలా వచ్చారు..చంద్రబాబు పర్యటనలో ఆయన ఎలా వ్యవహరించారో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రజలు ఏదైనా చెప్పేందుకు ముందుకు వస్తే చంద్రబాబు ..ఏయ్‌ కూర్చో అంటూ గదమాయించారు. చెప్పింది వినూ అంటూ బాబు కామెంట్‌ చేశారు. వైయస్‌ జగన్‌ చెప్పిన ప్రతి మాటకు ప్రజలు కేరింతలు కొట్టారు. చంద్రబాబులా ప్రశ్నిస్తున్న వారిని సీఎం వైయస్‌ జగన్‌ గదమాయించలేదని చెప్పారు. కోనసీమ లంక గ్రామాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంలో ప్రజలు, వరద బాధితులు వారి బాధను మరిచిపోయారు. తమ కష్టాలు వినడానికి సీఎం వచ్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాకు అండగా ఉంటారని విశ్వసించారని తెలిపారు. వరద బాధితుల్లో బాధ అనే ఆలోచన లేకుండా సీఎం వైయస్‌ జగన్‌ తీర్చారని చెప్పారు. వరద ప్రభావం కొనసాగుతుండగానే వైయస్‌ జగన్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top