జైల్లో పొత్తు పెట్టుకున్నది ఎవరు పవన్ కల్యాణ్?

మీడియా స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి  

ఇనుపకంచెలు, బారికేడ్ల మధ్య బాబు, పవన్‌ సభలు

చంద్రబాబు కంటే రాక్షసుడు, సైకో ఎవరూలేరు

ప్రత్యేకహోదా, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ రద్దుపై మోదీతో ప్రకటన చేయిస్తారా..?

ఉత్తరాంధ్రలో జనసంద్రమైన జగనన్న సభలు

ఆంధ్రాలో వార్‌ వన్‌సైడే.. కూటమి ఆశలు ఆవిరే..!

శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి

విశాఖ‌:  జైల్లో పొత్తు పెట్టుకున్నది ఎవరని వైయ‌స్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప్ర‌శ్నించారు. పవన్‌కళ్యాణ్‌ పిఠాపురంలోనూ ఓడిపోబోతున్నారని అతనికి అర్ధమైపోయింది. మూడు పార్టీల కూటమి అనేది ఓటమి పాలవుతోందనేది బోధపడింద‌న్నారు. కనుకే, జగనన్న మీద పరదాలంటూ.. మహారాణి అంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. మరి, నిన్న విశాఖపట్టణం వచ్చి వాళ్లు చూడొచ్చు కదా..? జగనన్న పరదాల మధ్యన ఉన్నారో..? ప్రజల మధ్యలో ఉన్నారో.. వచ్చి చూడొచ్చు కదా..?. వైయ‌స్ జగన్ బస్సుయాత్రలో అడుగడుగునా తన వద్దకొచ్చే మహిళలు, వృద్ధులు, చిన్నారులను పలకరించి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతున్నాయా..? లేదా..? అని ఆరాతీసి ముందుకు సాగుతున్నార‌ని చెప్పారు. సోమవారం వ‌ర‌దు క‌ళ్యాణి మీడియాతో మాట్లాడారు. 

విశాఖలో జనసంద్రంః
జగనన్న బస్సుయాత్రను మనం చూశాం. విశాఖపట్టణంలో జనప్రభంజనమైంది. జనం తండోపతండాలుగా తరలివచ్చి జగనన్నకు తమ మద్దతును తెలియజేశారు. ఇంత చక్కగా విశాఖను అభివృద్ధి చేస్తోన్న జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ప్రతీఒక్కరూ స్పందించారు. ఒకవైపు బంగాళాఖాతం ఉంటే, ఇంకోవైపు జనసముద్రం కనిపించి విశాఖలో రెండు సముద్రాల్ని నిన్న చూశాం. ఒక్క ఈ జిల్లాలోనే కాదు. ఉత్తరాంధ్రలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించి మూడు రోజులైంది. అప్పట్నుంచీ కూడా పాయకరావుపేట నుంచి అడుగడుగునా జననీరాజనం కనిపిస్తోంది. ఇందుకు ఒకటే కారణం కనిపిస్తోంది. ఇంత చక్కగా గొప్ప పరిపాలన అందించిన జగనన్న పాలనే మళ్లీ మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి మేము సంఘీభావం తెలియజేసి కృతజ్ఞత తెలియజేసుకోవాలని ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వస్తోన్న పరిస్థితిని మనం చూస్తోన్నాం. ఈ బస్సుయాత్రతోనే రాష్ట్రమంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాన్‌ గాలి వీస్తోందని అందరికీ అర్ధమైపోయింది. మేమంతా సిద్ధం బస్సుయాత్ర మొదలైన దగ్గర్నుంచీ ప్రతీ జిల్లాలోనూ అంతే జనసందోహం మనకు కనిపిస్తోంది. 175కి 175 స్థానాల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అయ్యిందనేది తేటతెల్లమైంది. 

ఇనుపకంచెలు, బారికేడ్లతో బాబు, పవన్‌ సభలుః 
తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల్లో ఒక ఫ్రస్టేషన్‌ మొదలైంది. వాళ్ల సర్వేల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తోందనే విషయం తేటతెల్లం కావడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీంతోనే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి గారిపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకుంటున్నారు. నిన్న పవన్‌కళ్యాణ్‌ మాట్లాడే తీరును చూస్తే.. అత్యంత జుగుప్సాకరంగా ఉంది. అతని మాట తీరేంటి..? హావభావాలేంటి..? ఇవన్నీ చూస్తే వాళ్లెంతగా ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైపోతుంది.  

పవన్‌కళ్యాణ్‌ పిఠాపురంలోనూ ఓడిపోబోతున్నారని అతనికి అర్ధమైపోయింది. మూడు పార్టీల కూటమి అనేది ఓటమి పాలవుతోందనేది బోధపడింది. కనుకే, జగనన్న మీద పరదాలంటూ.. మహారాణి అంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. మరి, నిన్న విశాఖపట్టణం వచ్చి వాళ్లు చూడొచ్చు కదా..? జగనన్న పరదాల మధ్యన ఉన్నారో..? ప్రజల మధ్యలో ఉన్నారో.. వచ్చి చూడొచ్చు కదా..?. జగన్‌ గారు బస్సుయాత్రలో అడుగడుగునా తన వద్దకొచ్చే మహిళలు, వృద్ధులు, చిన్నారులను పలకరించి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతున్నాయా..? లేదా..? అని ఆరాతీసి ముందుకు సాగుతున్నారు.
అదే టీడీపీ, జనసేన బహిరంగ సభల్ని చూస్తే.. ఇనుపకంచెలు ఏర్పాటు చేసుకుని వాటి మధ్య ప్రచార వాహనాలపై నిలబడి మాట్లాడుతున్న పరిస్థితిని చూడొచ్చు. అలాంటి మీరు మా జగనన్నను పట్టుకుని పరదాల చాటున తిరుగుతున్నారని అంటారా..? మీరొచ్చి కళ్ళారా చూస్తే.. ఎవరు పరదాల మాటున, ఇనుపకంచెల అవతల ఉన్నారో.. ఎవరు ప్రజల మధ్య ప్రజలతో మమేకమవుతూ ఉన్నారో తెలుస్తుంది కదా..? పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి మరీ ఎంత ఘోరమంటే.. వాళ్ల పార్టీ కార్యాలయంలో వీరమహిళలతో పెట్టుకునే మీటింగ్‌నూ బారికేడ్లతో నిర్వహిస్తారు. అంత అవసరమా..? నీలాంటోడు మా జగనన్నపై మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.

జైల్లో పొత్తు పెట్టుకుంది ఎవరు పవన్ కల్యాణ్?
మోదీగారితో చెప్పి పవన్‌కళ్యాణ్‌ ఏదో స్పెషల్‌ జైలు కట్టిస్తారంట. అయ్యా.. పవన్‌కళ్యాణ్, మీ అభిమాన నాయకుడు చంద్రబాబు అవినీతి గురించి మోదీగారు గతంలో ఏమన్నారో మరిచిపోవద్దండీ. మీరు ప్రత్యేకంగా జైలు కట్టించి మరీ సాగనంపేది చంద్రబాబునే అనేది కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మీనోటితో మీరే లోకేశ్‌ను ఉద్దేశించి పెద్ద అవినీతిపరుడు అనే సర్టిఫికేట్‌ ఇచ్చారు గదా.? మరి, అతని కోసం ఒక జైలు కట్టిస్తారా..? అంతెందుకు, మీరు మద్ధతు తెలియజేసింది జైల్లో ఉన్న చంద్రబాబుకే కదా..?. మీరు పొత్తు కుదుర్చుకున్నది జైల్లోనే కదా..? భవిష్యత్తులో వాళ్లతో పాటు మీరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో.. అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలా మంచిదని హెచ్చరిస్తున్నాం. 

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ రద్దు, ప్రత్యేకహోదాపై మోదీతో ప్రకటన చేయిస్తారా..?
నేనెవరికీ ఫోటోలుకు ఫోజులివ్వను. షేక్‌హ్యాండ్‌లు కూడా ఇవ్వను. నన్ను బ్లేడ్‌లతో కోస్తున్నారంటూ ప్రజల నుంచి తప్పించుకుంటున్నది పవన్ కల్యాణ్ కాదా?. అలాంటి మీరు మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారిని కామెంట్‌ చేస్తారా..?. ఇలా నోటికొచ్చిందల్లా మాట్లాడే తీరును బట్టి మీరెంత ఫ్రస్టేషన్‌లో ఉన్నారో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. కనుక, ఇకనుంచి గాలికబుర్లు, గాలి మాటలు ఆపేయడం మంచిది. నిజంగా, మోదీగారు మీ మాట వినేంత పరిచయమే ఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంతో ఒక ప్రకటన చేయించు. ఇదే నా సవాల్‌. మోదీ గారు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నోట్‌ను వెనక్కి తీసుకోమని చెప్పగలరా..? ఇంకా ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వమని మీరు అడగండి. ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ పెద్దలతో చెప్పించండి.  మీకు నిజంగా మోదీగారితో పరిచయం ఉంటే.. ప్రత్యేకహోదా సాధనతోపాటు.. విభజన హామీల్ని నెరవేర్చండి. ఇలాంటి రాష్ట్రప్రయోజనాల గురించి వదిలేసి మీరెందుకు గాలిమాటలు మాట్లాడుతున్నారు..? 
విశాఖపట్టణం రైల్వేజోన్‌ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ల్యాండ్‌ ఇవ్వడం జరిగింది. కానీ, కేంద్రం మాత్రం రైల్వేజోన్‌ ఏర్పాటును పెండింగ్‌లోనే పెట్టింది. దాన్ని ఎప్పుడు ప్రకటన చేస్తారు..? మరి, దీనిపై మీవంతు మీరు కృషిచేయాలనే బాధ్యత లేదా..? నిజంగా, మీకు మోదీగారితో పరిచయం ఉంటే.. ఎలక్షన్‌కు ముందే రైల్వేజోన్‌ ప్రకటించండి. ఎంతసేపూ జగన్‌మోహన్‌రెడ్డి గారిపై ఆడిపోసుకుంటూ ప్రజలు నవ్వుకునేలా మాట్లాడటం మంచిదికాదు.

చంద్రబాబు కంటే రాక్షసుడు, సైకో ఎవరూలేరుః
చంద్రబాబు నాయుడు అంత పెద్ద సైకో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా..? మీరు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చి పదేళ్లుపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలేశారు. ఈ రాష్ట్రప్రజలకు హైదరాబాద్‌ను దూరం చేసి ఇన్ని కష్టాలకు కారణమైన వ్యక్తివి నువ్వు. మరి, నీ కంటే అవినీతిపరుడు, నీకంటే పెద్ద సైకో ఎవరున్నారు..?
ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి సైకో అవుతాడా..? ఆయన సైకో అయితే పేద కుటుంబాల్లో పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివిస్తారా..? ప్రభుత్వ స్కూళ్లను నాడు - నేడు పేరిట ఆధునీకరిస్తారా..? వారు చదువుకు అవసరమైన పుస్తకాలు దగ్గర్నుంచీ దుస్తులు, బూట్లు పంపిణీ చేస్తారా..? జగనన్న గోరుముద్ద వంటి పోషకాహారం పిల్లలకు పెడతారా..? కార్పొరేట్‌ విద్యకు తలదన్నే ప్రభుత్వ విద్య ఏ రాష్ట్రంలోనైనా చూశారా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ పేదలను అక్కునజేర్చుకుని వారి జీవనప్రమాణాల మెరుగుదలకు రూ.2.75 లక్షల కోట్లు డీబీటీ లబ్ధిని అందించిన వ్యక్తి సైకో అవు తాడా..? పేదోడికి వైద్యం ఖరీదు కాకూడదని.. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకూ వైద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించే వ్యక్తి సైకో అవుతాడా..? పేదోడు నిలువ నీడ లేకుండా ఉండరాదంటూ.. అద్దెలభారంతో మగ్గేవారికి సొంతింటి కల నెరవేర్చిన వాడు సైకో అవుతాడా..? ఆసరా, చేయూత వంటి పథకాలతో మహిళలు తమ సొంత కాళ్ల మీద తాము నిలబడేలా పనిచేసే ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అంటారా..? వృద్ధులు, వింతతువులు, విభిన్నప్రతిభావంతులకు ప్రభుత్వ పింఛన్‌ సొమ్ము రూ.3వేలు నెలలో మొదటి తేదీనే ఇంటికి తెచ్చి అందిస్తోన్న వ్యక్తిని సైకో అంటారా..? వీటన్నింటినీ పైసా లంచం లేకుండా ఇంటి గడపల దగ్గరకే తెచ్చి అందించే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టి.. దేశవ్యాప్తంగా ఆదర్శమైన ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు సైకో అంటారా..? మీరు పదేపదే ఇలా అంటుంటే ప్రజలు గమనించడం లేదునుకున్నారా.? వారు మిమ్మల్ని ఊరుకుంటారా..? ఖచ్చితంగా తిరగబడి మిమ్మల్ని తరిమేసే రోజులొచ్చాయి.

ఉత్తరాంధ్రకు ఎంతో మేలు చేసిన జగన్ గారికే ఆ హక్కు ఉంది...
ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టే హక్కు గానీ.. ఇక్కడి ప్రజలను ఓట్లు అడిగే హక్కు గానీ ఒక్క మా జగనన్నకే ఉంది. ఎందుకంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన ఎన్నో చేశారు. ఇచ్ఛాపురం నుంచి పాయకరావు పేట వరకు అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తోంది. రూ.740 కోట్లతో వంశధార నీటిని తీసుకొచ్చి ఉద్దానం కిడ్నీవ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి గారికే దక్కుతోంది. అలాగే, రూ.200 కోట్లతో 200 పడకల కిడ్నీ వ్యాధుల ఆస్పత్రితో పాటు రీసెర్చి సెంటర్‌ను కూడా ఇక్కడ నెలకొల్పారు. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, భోగాపురంలో అంతర్జాతీయ ఏయిర్‌పోర్టు, ఉత్తరాంధ్రలో 4 మెడికల్‌ కాలేజీలు, కురుపాంలో ఇంజినీరింగ్‌ కాలేజీ, విశాఖలో ఇన్‌ఆర్బిట్‌మాల్, ఇన్ఫోసిస్, అదానీ డేటాసెంటర్, రూ.6వేల కోట్లతో 6 లైన్ల హైవే ఏర్పాటు, ఎన్నో టూరిజం ప్రాజెక్టులు ఇలా అడుగడుగునా అభివృద్ధి చూపించిన ముఖ్యమంత్రి మా జగనన్నే అని చెప్పుకునేందుకు మేమెంతో గర్వపడుతున్నాం. 

మీరు ఎన్ని కూటములు కట్టినా.. ఎంత మంది కలిసొచ్చినా.. ప్రజలంతా మా జగనన్న పక్షాన ఉన్నారనేది వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధం సభలు ద్వారా, మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా నిరూపితమవుతోంది. మీరెంత ఫ్రస్టేషన్‌కు గురైనా వార్‌ వన్‌సైడే అనే విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలి.

Back to Top