నేటి నుంచి సోష‌ల్ మీడియా సైనికుల ఆత్మీయ స‌మ్మేళ‌నం

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల‌ మేరకు డిసెంబర్ 1 నుంచి 6 వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పార్టీ సోషల్ మీడియా  సైనికులతో  విస్తృత స్థాయి ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హిస్తున్నారు.  డిసెంబర్ 1 నుంచి 4 వరకు తాడేపల్లిలోని సీఎస్ఆర్ ఫంక్ష‌న్ హాల్‌ లో, 6న విశాఖపట్నం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో  నిర్వహించే ఈ  సమావేశాలు ఏర్పాటు చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులంద‌రినీ ఈ స‌మ్మేళ‌నానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. సోష‌ల్ మీడియా సైనికులు ఈ సమావేశాలకు తరలి వచ్చి విజ‌య‌వంతం చేయాలి. ఈ స‌మావేశం గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గుర్రంపాటి దేవేంద్ర‌ రెడ్డి (9989033380),  వాసుదేవ రెడ్డి (9160620847),  హ‌ర్ష‌వ‌ర్థ‌న్ (9658166666)ను సంప్రదించగలర‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top