చిత్తూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో వైయస్సార్‌సీపీ ఆధిక్యంలో నిలిచింది. కొద్దిసేపటి క్రితం వెలుబడిన ఫలితాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. గురుమూర్తికి 2,29,424 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు 3,594 ఓట్లు పోలయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికలో వైయస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైయస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.