చంద్రబాబుకు నారాయణస్వామి మూడు ప్రశ్నలు

అసెంబ్లీ: ఒకే కుటుంబంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. శాసనసభ సాక్షిగా చంద్రబాబుకు డిప్యూటీ సీఎం మూడు ప్రశ్నలు వేశారు.. ఆత్మసాక్షిగా బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏం మాట్లాడారంటే..

1. చంద్రబాబు నారావారి పల్లెలో పుట్టారు. అక్కడ నా బంధువులు ఉన్నారు.
నారావారి పల్లెలో గుడిలోకి మాదిగ, మాలలకు ఇప్పటికీ ప్రవేశం ఉందా..? చంద్రబాబు సమాధానం చెప్పాలి.
2. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.. బ్రహ్మాండంగా ఎస్సీలకు చట్టాలు తెచ్చామని చంద్రబాబు అన్నాడు. నేను పాదిరగుప్పంలో పుట్టి పెరిగాను.. చంద్రబాబు అతని మామతో చేతులు కలిపి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా అయిన తరువాత ఊరికే కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేసినట్లుగా ఒక ఫోజు కొట్టి తెలుగుదేశం వారి ద్వారా ఓట్లు వేయించుకున్నాం.. ఎవరి ఊర్ల మీద మేము పడలేదు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 300 ఇళ్లు కాల్చాడు.. కాంగ్రెస్‌ తరుఫున ఒక్క స్టేట్‌మెంట్‌ ఇచ్చాడేమో అడగండి.

3. మాలమాదిగలను నేను అభివృద్ధి చేశానని కళ్లు ఉరుముకుంటూ మాట్లాడుతున్నాడు. కారంచేడు మాదిగపల్లెను ఏం చేశాడు.. ఇతను ముఖ్యమంత్రి అయిన తరువాత కారంచేడు వ్యవహారం ఎంత వరకు వచ్చింది.. చనిపోయిన వారి పరిస్థితి ఏంటీ..? వాళ్లకు శిక్ష ఏమైనా పడింది.

ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. దళితులు 35 మందిలో ఎంతమందిని గెలిపించుకున్నావు చంద్రబాబూ.. ఐదు సంవత్సరాల పాలనలో వైయస్‌ జగన్, ఆయన తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని  విపరీతంగా తిట్టాడు. వైయస్‌ఆర్‌ లేకపోతే చంద్రబాబుకు భిక్షపెట్టేవాడే లేడు.

1981లో సమితి అధ్యక్షుడిగా పోటీ చేస్తే నాపై చిత్తూరు నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి పోటీపెట్టి నన్ను చంద్రబాబు చాలా బాధలు పెట్టాడు. అయినా 16 వేలతో గెలిచాను. గెలిచిన తరువాత మళ్లీ నాకు బేరాలు పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.

దళితులను బ్రహ్మాండంగా చేశానంటున్నాడు.. మా కోసం ఏ రోజు అయినా ఒక చిన్న స్టేట్‌మెంట్‌ ఇవ్వగలిగాడా.. ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ వస్తే మాల, మాదిగల మధ్య గొడవలను పెట్టాడు. ఇటువంటి వాడిని కన్నందుకు చంద్రబాబు తల్లి కడుపుమంట మంట అని కొట్టుకొని ఉంటుంది. మా కుటుంబాలను సర్వనాశనం చేసిన దేశంలోనే ఏకైక నాయకుడు చంద్రబాబు’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

   
Back to Top