తాడేపల్లి: నిన్నటి ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో మా వర్గాలకు అగ్రాసనం వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరం కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి. ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. మా సామాజిక వర్గంలో తానే మొట్ట మొదటి మంత్రిని అని తెలిపారు. వైయస్ జగన్ గారి నిర్ణయానికి మా వర్గాలన్నీ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. తన పాదయాత్రలో జగన్ గారు అన్ని వర్గాల స్థితి గతులను అధ్యయనం చేసిన తర్వాతే మా వర్గాల సంక్షేమానికి కంకణం కట్టుకున్నారు. తన 44 నెలల పాలనలో మా వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్, ఫూలేల ఆలోచనలకు ప్రతిరూపం వైయస్ జగన్ గారు అంబేడ్కర్, ఫూలే లు జీవిత కాలం పోరాడిన అంశం రిజర్వేషన్ల కేటాయింపు... జగ్జీవన్‌రామ్ కలలకు ప్రతిరూపంలా.... అభినవ ఫూలేగా, అభినవ అంబేడ్కర్‌గా...ఒక కొమురం భీమ్ మాదిరిగా...విశాలమైన ఆలోచనతో జగన్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. రాజ్యాధికారం ఇస్తేనే వెనుకబడిన తరగతులు తమ గొంతు బలంగా వినిపిస్తారని ఆయన భావించారు కాబట్టే, నిన్న ప్రకటించిన 18 మంది ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది బీసీలకు ఇచ్చారు. ఇవే కాదు ఈ మూడున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు స్థానిక సంస్థలు, మార్కెట్ యార్డు, కార్పొరేషన్ పదవులు, దేవాలయ కమిటీలు...ఇలా అన్ని పదవుల్లోనూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీట వేశారు. ఇంత విప్లవం తీసుకొచ్చిన సీఎం దేశంలోనే ఎక్కడా కనిపించరు. ప్రతీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని ఆయన సొంతం చేసుకున్నారు. మా కులంలో నేనే మొదటి మంత్రిని జగన్ గారి విశాల దృష్టికి నేనే ఒక నిదర్శనం..కురుబ కులంలో నేను మొదటి మంత్రిని. నన్ను నమ్మి, ఆయన ఎంతో ఔదార్యంతో బీసీని అయిన నాకు మంత్రి పదవిని ఇచ్చారు. ఇంతటి సామాజిక న్యాయం అమలు చేస్తున్న వైయస్ జగన్ గారిని వెనుకబడిన తరగతుల వారంతా తమ సొంత మనిషిగా భావిస్తున్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ స్థానాల్లో బాబు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ 37.5 శాతం మాత్రమే. దీనికి రెట్టింపుగా వైయస్ జగన్ గారు 68.18 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీసీల తోక కత్తిరిస్తానన్నది బాబు... బీసీల తోక కత్తిరిస్తానని వారిని ఏహ్యభావంతో తిట్టిన వ్యక్తి చంద్రబాబు. పనిముట్లు ఇచ్చేస్తే బీసీలంతా బాగుపడిపోతారని బాబు సరిపెట్టుకుంటే..దీనికి భిన్నంగా ...జగన్ గారు బీసీ సంక్షేమానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజ్యాధికారం ఇచ్చారు. 11 ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభ ఇస్తానని ఆశ చూపెట్టి, బాబు చేసిన అవమానాన్ని ఎవరైనా మరిచిపోగలరా?. టీడీపీకి తెలిసిన టక్కరి విద్య ఇదే. ఆ పార్టీదంతా వక్ర రాజకీయమే. చట్టసభల్లో బీసీల గొంతు వినపడాలని తపించే ముఖ్యమంత్రి మా జగన్ గారు. నాటికీ ...నేటికీ బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ గారే... రాష్ట్ర రాజకీయాల్లో జగన్ గారికి ముందు, తర్వాత అనే పోలిక తెస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ వెనుకబడిన వర్గాలకు ఇంతగా ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. బీసీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా వెనుకబడిన వర్గాలకు ఇంత న్యాయం జరగలేదు. రాజకీయమంటే కేవలం పదవులు పంపకం కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అధికారంలో భాగస్వాములను చేసినప్పుడే అసలైన రాజ్యాధికారమని జగన్ గారు భావించబట్టే ఈ రోజు మా వర్గాలన్నీ నిండు మనసుతో ఆయన్ను జయహో జగన్ అంటూ కీర్తిస్తున్నాయి. మా వర్గాల పట్ల ఇంత ఆదరణ చూపిన జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని మా సామాజికవర్గాలన్నీ కంకణం కట్టుకున్నాయి. పాదయాత్ర అంటే చిత్తశుద్ధి... జగన్ గారు పాదయాత్రను చిత్తశుద్ధితో చేశారు. జనానికి ఏం కావాలో దాన్నే మాట్లాడారు. ప్రస్తుతం ఎవరికి ఏ సంక్షేమం అవసరమో అదే అమలు చేస్తున్నారు. ఇదంతా మొక్కుబడిగాకాదు. నిండు మనసుతో మా వర్గాల సంక్షేమానికి కట్టుబడిన మహనీయుడాయన. టీడీపీ చిత్తశుద్ధి లేని పాదయాత్రలు చేస్తోంది. తాము ఏం చేస్తామో చెప్పలేని టీడీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ గారిని, మంత్రులను, ఎంపీలు, ఎమ్మెల్యేలను తిడుతూ పాదయాత్రలు చేస్తున్నారు. ఇలా తిట్ల దండకాన్ని విని జనం ఓటేయరన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తిస్తే మంచిదని హితవు పలుకుతున్నాను. అవకాశమున్నా బీసీలను విస్మరించిన టీడీపీ గతంలో మీ పార్టీ బీసీలకు పట్టం కట్టే అవకాశమున్నా ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలను ఎందుకు ఎంపిక చేయలేకపోయారో టీడీపీ నేతలు సమాధానమివ్వగలరా? అని ప్రశ్నిస్తున్నాను. జగన్ గారి పాలనలో పదవుల పంపిణీ మాత్రమే కాదు . సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకూ డీబీటీ రూపంలో అందుతున్నాయి. టీడీపీ హయాంలో మాదిరిగా ఇప్పుడు జన్మభూమి కమిటీల గోల లేదు. లంచాలు లేవు. దళారులు అసలే లేరు. సింహభాగం పథకాలు మా వర్గాలకే లభిస్తున్నాయని సగర్వంగా మేం చెప్పగలం...ఎల్లో మీడియా దీన్ని వక్రీకరించినా జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాస్తవమేమిటో జనానికి తెలుసు. అందుకే జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని అన్ని వర్గాలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. - జగన్ గారంటే ఒక నిజం.. ఎల్లో మీడియాలో ఎంతగా వక్రీకరించి రాతలు రాసినా జనం నమ్మే స్థితిలో లేరు. ప్రజలందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం వైయస్ జగన్ గారిపైనే ఉన్నాయి అని శ్రీమతి ఉషశ్రీ చరణ్ వివరించారు.