వైయస్‌ జగన్‌ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం..సుపరిపాలన

సమర్థవంతమైన పరిపాలన అందిస్తారు

జగన్‌ సీఎం అయితే సకాలంలో వర్షాలు

పంచాగ శ్రవణంలో వేదపండితులు

వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

వేదపండితులను సత్కరించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేదపండితులు విష్ణుభట్ల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైయస్‌ జగన్‌కు అధికార యోగం సిద్ధిస్తుందని పండితులు విష్టుభట్ల లక్ష్మీనారాయణ తెలిపారు.ప్రత్యేకహోదా సాధించగలుగుతామని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితే వర్షాలు సకాలంలో కురుస్తాయని రైతులకు లాభాదాయకంగా ఉంటుందన్నారు. మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలను వైయస్‌ జగన్‌ తెరిపిస్తారన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రియల్‌ఎస్టేట్‌ బాగుంటుందన్నారు.సమర్ధవంతమైన పరిపాలన చేస్తారన్నారు.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేదపండితులను శాలువాలు కప్పి సత్కరించారు.తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.వికారి నామ సంవత్సరంలో అందరి జీవితాల్లో ఆనందం తీసుకురావాలన్నారు.అన్నివర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.క
 

 

Back to Top