సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ రాకేష్‌ అరెస్ట్ 

చిలకలూరిపేట: రాష్ట్రంలో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూ రిపేటలోని తూర్పు మాలపల్లెకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుంటూరులో అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అత­ని తండ్రి దొడ్డా దాసును పోలీసులు 4 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన బాషా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్‌గాంధీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్‌గాంధీపై రాష్ట్రవ్యాప్తంగా పలు­చోట్ల కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్‌ సీఐ పి.రమేష్‌ను వివరణ కోరగా, దొడ్డా రాకేష్‌­గాంధీని అరెస్టు చేశామన్నారు. రాకేష్‌గాంధీని న్యా­యస్థానంలో హాజరుపరిచారు. చిలకలూరిపేట కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

Back to Top