కేంద్రం తలచుకుంటే స్టీల్‌ ప్లాంట్‌ను పునరుద్ధరించవచ్చు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

 కేంద్రం ప్రకటనపై ఎల్లో మీడియావి తప్పుడు రాతలు

స్టీల్‌ ప్లాంట్‌ కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల సెంటిమెంట్‌లో ఒక భాగం

ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు ప్రధానికి సీఎం మరోసారి లేఖ రాశారు

 అఖిలపక్షం, కార్మికసంఘాలతో కలిసి ప్రధాని కలిసేందుకు సీఎం సిద్ధం

ప్రతిపక్షం, ఎల్లోమీడియా వంకరబుద్ధితో ప్రవర్తిస్తున్నాయి

రామోజీ, రాధాకృష్ణలకు తలకాయ నిండా విషపూరిత ఆలోచనలే..

పాట్నర్‌ పవన్‌కల్యాణ్‌ బీజేపీ మెడలు వంచొచ్చుకదా..?

తాడేపల్లి:  కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పునరుద్ధరించవచ్చు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావటానికి సూచనలు చేశామన్నారు. అఖిల పక్షం, కార్మిక సంఘాలతో కలిసేందుకు అపాయింట్‌ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖ రాశారని తెలిపారు. కేంద్రం ప్రకటనపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలను ,ప్రతిపక్షాల సవాళ్లను ఆయన తిప్పికొట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాéన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ఇచ్చిన వివరణను రాజకీయం చేయాలని కొన్ని పార్టీలు, శక్తులు ప్రయత్నం చేయడం. దానికి తగినట్లే ఎల్లో మీడియాలో పిచ్చి రాతలు రాశాయి. తప్పుడు రాతలకు సంబంధం లేకుండా నిర్మాల సీతారామన్‌కు స్పష్టంగా వందశాతం పెట్టుబడులు అమ్మాలని కేంద్రం నిర్ణయం తీసుకన్నుట్లు చెప్పడంతో..ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. గతంలో రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఏపీ ప్రజల సెంటిమెంట్‌ అయిన విశాఖ ఉక్కును అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కొన్ని సూచనలు చేశారు. ఇందులో స్టేట్‌ హోల్డర్స్‌ అయిన కార్మికులు, ప్రజల పక్షాన ఉన్న సంఘాలు ఉన్నాయి కాబట్టి అఖిలపక్షాల నాయకులను, కార్మిక సంఘాల నాయకులను కలుపుకొని మీ వద్దకు వస్తామని ప్రధానికి అపాయింట్‌ ఇవ్వాలని లేఖ రాశారు.
ఇప్పటికే మా ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం నుంచే చేసే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ ఉత్తరం రాశారు. దీనికి ముందుగానే సీఎం వైయస్‌ జగన్‌ విశాఖ వెళ్లిన సందర్భంలో  చాలా ఓపికగా కార్మిక సంఘాలతో మాట్లాడారు. వారి సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పోస్కో కంపెనీకి సీఎం వైయస్‌ జగన్‌ కొన్ని సలహాలు కూడాఇచ్చారు. కృష్ణపట్నం, కడప రావాలని సూచించారు. ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు కృష్ణపట్నం వచ్చి వెళ్లారు. ఒక వైపు విశాఖ కర్మాగారాన్ని కాపాడుతూనే..మరోవైపు పోస్కో కంపెనీకి ఇతర ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందిస్తోంది. ఇందులో ఏమీ దాపరికం లేదు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, పరిశ్రమలను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. వ్యాపారంలో మాద్యం వచ్చినప్పుడు ఖర్చులు తగ్గించుకోవడం ఎలా, ప్రోడక్షన్‌ పెంచుకోవడం ఎలా అని ఆలోచన చేస్తారు. కార్మిక కుటుంబాలు నిలబడాలి. నిర్మాణాత్మక వైఖరి విశాఖ ఉక్కు విషయంలో వైయస్‌ జగన్‌ తీసుకున్నారు. ఏం చేసినా ఇది వాస్తవం. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ల ఆస్తి..కేంద్రం ఎలా నిర్వహించుకుంటుందో వాళ్లిష్టం. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కార్మికుల పరిస్థితి ఏంటి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మార్కెట్‌ వ్యాల్యూ తీసుకుంటే..లక్ష కోట్లు ఉంటుంది. పాత రేట్ల ప్రకారం తక్కువ చూపడం సరికాదు. ఎవరికి నొప్పు కలుగకుండా అందరికి భద్రత ఉండేలా ఏం చేయాలనే సలహాలు వైయస్‌ జగన్‌ చెప్పిన దాని గురించి ఆలోచన చేస్తారు. ప్రతిపక్షం, ఎల్లోమీడియా మాత్రమే భిన్నంగా ఆలోచన చేస్తాయి. వక్రబుద్ధితో వాళ్లు మాట్లాడుతున్నారు. నిర్మాల సీతారామన్‌ చెప్పిన దాంట్లో కొత్త కోణం ఏదీ లేదు. పవన్‌ కల్యాణ్‌ కూడా అదే చెప్పారు కదా? కానీ ఆయనే మళ్లీ పార్లమెంట్‌లో పోరాడాలని చెబుతారు. ఆయనే పోరాటం చేయవచ్చు కదా? . కేంద్రం మెడలు వంచవచ్చు కదా? ఇక్కడికి వచ్చిన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎవరో వచ్చి మమ్మల్ని రాజీనామా చేయమని చెబుతున్నారు. ఏ స్టెప్‌లో ఏం చేయాలో..ఎట్లా డీల్‌ చేయాలో మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అవగాహన ఉంది. వృద్ధుడు చంద్రబాబు కంటే 1000 శాతం బెటర్‌గా మేం డీల్‌ చేస్తాం. అందులో భాగంగానే సీఎం వైయస్‌ జగన్‌ అఖిలపక్షాలతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. మిగిలిన వారు కూడా సలహాలు ఇవ్వవచ్చు. 
నిర్మాల సీతారామన్‌ అన్న అంశాలపై ఆ రెండు పత్రికలు వక్రీకరించి రాశాయి. తల నిండా రామోజీ రావు, రాధాకృష్ణకు విషపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వైయస జగన్‌పై విషపూరితంగా వార్త కథనాలు రాశారు. వీటిపై టీవీల్లో చర్చోపచర్చలు పెడుతున్నారు. రాజకీయ పక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వాళ్లకు మద్దతుగా నిలిచింది. ఇటీవల రాష్ట్ర బంద్‌కు కూడా సంఘీభావం తెలిపాం. వేరే మార్గం లేని చోట ప్రతిపక్షాలు చెప్పినవి ఆచరించవచ్చు కానీ. స్టీల్‌ ప్లాంట్‌ను నిలబెట్టడానికి అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. చాలెంజ్‌లు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా తప్పుడు రాతలు మానుకోకపోతే..రాష్ట్రంలో ఇలాంటి పత్రికలు ఉండటం దౌర్భాగ్యమనుకోవాలి. పత్రికాధినేతలుగా ఆ ఇద్దరు పనికి రారు అని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. చంద్రబాబుకు స్టీల్‌ ప్లాంట్‌ కొనే శక్తి ఉంది. ఆయనను కొనమని సలహా కూడా ఇస్తున్నాం. టీడీపీ నేతలు, రాష్ట్ర ప్రజలు కూడా ఇదే డిమాండు చేయాలి.
హైకోర్టు, పోలవరం గురించి కేంద్ర మంత్రి అమీత్‌షాకు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ ఇవ్వలేదని కొన్ని కథనాలు రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి లేఖ ఇస్తే..ఆ లేఖ హోం డిపార్టుమెంట్‌కు ఎలా వెళ్తుంది. అ లేఖ పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాకా మేం దాచి పెట్టాల్సిన అవసరం ఏముంది. ఇది ప్రజలకు అర్థం కాదా? సీఎం వైయస్‌ జగన్‌పై ఏదోరకంగా బురద చల్లాలని ప్రతిపక్షాలు సందర్భం లేకపోయినా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి రాతలు మానుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. 

 
 

తాజా వీడియోలు

Back to Top