దశాభ్దాలుగా ఉన్న వ్యవస్దలను చంద్రబాబు నాశనం చేశారు

వైయస్ జగన్ ప్రజలకు మేలు చేసే నూతన వ్యవస్దలకు జీవం పోశారు.

 కరోనాలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలందించారు.ప్రజల ప్రాణాలను కాపాడారు.

 విపత్కర పరిస్దితులలో కూడ వాలంటీర్లు పేదలకు పధకాలను ఇంటికి చేర్చారు.

 నేడు అలాంటి వాలంటీర్ల వ్యవస్దపై పవన్ కల్యాణ్,చంద్రబాబులు దుష్ప్రచారం చేస్తున్నారు.

 వచ్చిన నాలుగు నెలల్లోనే లక్షా 30 వేలమందికి ఉద్యోగాలను కల్పించిన ఘనత శ్రీ వైయస్ జగన్ ది.

 ఎటువంటి అవతకవకలకు తావు లేకుండా గ్రామసచివాలయాలలో ఉద్యోగాలిచ్చారు.

 ఈ విధమైన  ఉద్యోగాల కల్పన దేశంలో మరే రాష్ర్టంలో లేదు.

 వారికి అనుబంధంగా 2.60 లక్షలమంది వాలంటీర్ల వ్యవస్దను తెచ్చారు.

 ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి.

 అయినా వాటిని ప్రజలు నమ్మరు.

 జగనన్న సురక్షలో 47లక్షల సర్టిఫికెట్లు జారీ చేశారు.97 లక్షల పెండింగ్ ఆర్జీలను పరిష్కరించారు.

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు నాశనం చేశారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి మండిప­డ్డారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్‌ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమ­యంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ బెస్ట్‌ స్టేట్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరా­లతో రాయదగ్గదన్నారు.  ఎన్టీఆర్‌ జిల్లా విజయ­వాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడు­కల్లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. 

వాలంటీర్ల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు కరోనాలో వారు ప్రాణాలకు తెగించి అందించిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందని హితవు చెప్పారు. ఇప్పుడు వాలంటీర్లు తలపులు తడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్,చంద్రబాబులు కరోనా సమయంలో ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు.బయటకు రావడానికే ప్రపంచం అంతా భయపడిపోయిన కరోనా సంక్షోభంలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికి కరోనా సోకింది...వారికి ట్రీట్ మెంట్ అందించాల్సిన అవసరం అనే విషయాలను తెలుసుకుని వైద్యసేవలు అందించిన అంశం ప్రజలు మరిచిపోరని అన్నారు.

కరోనా సేవల విషయంలో బెస్ట్ స్టేట్ గా ఏపి నిలిచిపోయిందన్నారు.ఈ అంశాన్ని ఏపి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయవచ్చు.వాలంటీర్ల సేవలను దేశం అంతా వచ్చి స్టడీ చేసింది.వాలంటీర్లు  ట్రీట్ మెంట్ విషయంలో ఇంటికి వచ్చి వాళ్లే చూస్తున్నారని వాలంటీర్లను ఉద్దేశించి చెప్పుకున్నారు అని వివరించారు.

ఈరోజు అలాంటి వాలంటీర్ల గురించి చంద్రబాబు,పవన్ లు అంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని అన్నారు. ఆరోజు ఎవరూ ఇలా మాట్లాడలేదు.వాలంటీర్లు వారి ప్రాణాలు పణంగా పెట్టి మరీ కరోనాలో సేవలందించారు. జగన్ గారి పధకాలు అన్నీ ఆపకుండా ప్రజలకు అందించారు.
  వైయస్ జగన్ వికేంద్రీకరణ కిందివరకు.....పరిపాలన ప్రతి గడపకు తీసుకువెళ్లారు.

       వరద,తుపాను అలాంటి ఆపదలు ఏదైనా రాని కేలండర్ ప్రకారం లబ్దిదారులకు అందించడం వాలంటీర్లు చేస్తున్నారని అన్నారు.ముఖ్యంగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే లేపి వారికి పెన్సన్లు అందిస్తున్నారని అన్నారు.

          పరిపాలనలో వికేంద్రీకరణ చేసి 26 జిల్లాలను ఏర్పాటుచేశారన్నారు.గ్రామసచివాలయాల వ్యవస్దను తీసుకువచ్చి లక్షా 30 వేల ఉద్యోగాలను కల్పించారన్నారు.వాటిని ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రతిభ ఆధారంగా విద్యావంతులకు అదికూడా అత్యధికంగా ఎస్సిఎస్టిబిసి మైనారిటీలకు దక్కాయన్నారు. వారికి  అనుబంధంగా 2.60 లక్షల వాలంటీర్ల వ్యవస్దను తీసుకువచ్చారన్నారు. వారి ద్వారా పధకాలన్నీంటిని ఇంటింటికి తీసుకువెళ్తున్నారన్నారు. డిబిటి ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు డైరక్ట్ గా ప్రజల అకౌంట్లకు చేరుతున్నాయన్నారు.ఆఖరకు రిజిస్ర్టేషన్ సౌకర్యం కూడా గ్రామసచివాలయానికి తీసుకువచ్చారు.ప్రజలు గతంలో రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివచ్చేది.నేడు ఆ పరిస్దితికి చరమగీతం పాడారు.ప్రజలకు ఏమీ కావాలో అడిగి మరీ వారికి అందిస్తున్నారు.

       జగనన్న సురక్ష కార్యక్రమంలో 97 లక్షల పెండింగ్ ఆర్జిలను పరిష్కరించారు.అందులో వివిధ రకాల 47 లక్షల సర్టిఫికేట్లు జారీ చేశారు.
ఇంతకుముందు ఇలాంటివి అన్నీ పెండింగ్ లో ఉండి ప్రజలు ఇబ్బందులు పడేవారు.
ఇదంతా జగన్ గారు ఆలోచనలలోనుంచి పుట్టిన వినూత్న కార్యక్రమమే జగనన్న సురక్ష అని వివరించారు.

           వరదలు వస్తే సిఎం వైయస్ జగన్ ఎందుకు పోవడం లేదంటూ  చంద్రబాబు అంటున్నారు.నిజానికి చంద్రబాబు హయాంలో అలాంటి సమయంలో తన ప్రచారయావకోసం ప్రజలను,అధికారులను ఇబ్బంది పెట్టేవారు.నేడు శ్రీ వైయస్ జగన్ ఉధ్యోగులు,అధికారులు ప్రజలకు ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకునేలా చేస్తున్నారు.ఆ తర్వాత కొద్దిరోజులకు అవన్నీ ప్రజలకు అందాయా ఇంకా ఏమైనా వారికి అవసరమా అని తెలుసుకునేందుకు పర్యటనలకు వెళ్తున్నారు.అధి జగన్ గారి చిత్తశుద్దిని తెలియచేస్తోంది.చంద్రబాబులాగా ఆలోచిస్తే  అధికారులు ఉద్యోగులు ఎలా పనిచేస్తారు.గతంలో ఆయన రాజకీయం కోసం పర్యటనలు చేసి డ్రామాలు చేసేవారు.జగన్ గారు కలెక్టర్లు,అధికారులకు వరదలు,తుపానుల సమయంలో తగిన విధంగా స్పందించమని ఆదేశాలు ఇస్తున్నారు. నేడు దాని కారణంగా ఉధ్యోగ వ్యవస్ద ప్రజలకు భరోసా ఇచ్చింది.

        గ్రామసచివాలయ వ్యవస్ద  వైయస్ జగన్ కు బలం.ఆ వ్యవస్దలను అందరం కాపాడుకోవాలి.అవి ప్రజలకు మేలు చేసేవి.వాటిని ధ్వంసం చేయడం ద్వారా జగన్ గారిని బలహీన పరచాలని చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు చూస్తున్నారు.అందుకే అడ్డదారుల్లో అధికారం పొెందాలనే ధ్యేయంతో ఇలాంటి దుష్ప్రచారం ప్రారంభించారు.భవిష్యత్తులో ఎవరైనా పాలకులుగా ఉండవచ్చు కాని ప్రజలకు మేలు చేసేవాటిని కొనసాగించేలా చేసుకోవాలి.గతంలో ఎన్టీఆర్ మండల వ్యవస్దను ప్రవేశపెట్టారు. వైయస్ జగన్ తన పాలనలో జవాబుదారీతనం తీసుకువచ్చారు.అకౌంటబులిటీ తెచ్చారు.నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఆ విధమైన వ్యవస్దలను ఏర్పాటుచేస్తున్నారు.ప్రజలకు మేలు చేసే  వైయస్ జగన్ గారి లాంటి నాయకుడు మనకు కావాలా..అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ వ్యవస్దలను నాశనం చేసేవారు కావాలా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు.

తాజా వీడియోలు

Back to Top