ఉద్యోగ సంఘాల చర్చల్లో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఉద్యోగ సంఘాల చర్చల్లో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై చర్చించాల్సి ఉందన్నారు. ఫిట్‌మెంట్‌ 23 శాతంలో మార్పు ఉండదన్నారు. సీసీఏ రద్దు చేయమని ఉద్యోగులు అడిగారన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌ల్లో సవరణలతో రూ.7 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా వేశారన్నారు. హెచ్‌ఆర్‌ఏలో పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు కోరారని తెలిపారు. కనీస హెచ్‌ఆర్‌ఏ 12 శాతం ఉండాలని అడిగారని చెప్పారు.
 

Back to Top