కుప్పం, మంగళగిరి ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలే అండ

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా 
 

 తిరుపతి : ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పం, ఆయన కుమారుడు లోకేష్‌ ఓడిన మంగళగిరి నియోజకవర్గాల ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలే అండగా ఉన్నారని  ఏపీఐఐసీ ఛైర్మన్‌, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ గాలికబుర్లు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, ప్రజలకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా ఉచితంగా రేషన్ ఇచ్చి పేదలను ఆదుకున్నామని చెప్పారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీకి తెచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం వైయస్‌ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top