శ్రీకాకుళం: విపక్షాల విమర్శలు సహేతుకం కావు అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. చింతాడ గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. మీ అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో ఇవాళ మీ ఇంటికి వచ్చాము. మీ అవసరాలు తీర్చుతాము అని ఆనాడు ఎలక్షన్స్ లో హామీ ఇచ్చాము. ఆ హామీ మేరకు ఆ రోజు చెప్పిన ప్రతి పనినీ పూర్తి చేసేందుకు, ప్రకటించిన ప్రతి పథకాన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే 90 శాతానికి పైగా హామీలు అమలు పూర్తి చేశాం. అయినా కూడా ప్రతిపక్ష నాయకులు హేళన చేస్తున్నారు. అసంబద్ధ రీతిలో విమర్శలు చేస్తున్నారు. ఇది సబబు కాదు. గత 5 ఏళ్లలో టీడీపీ సర్కారు చేయని పనులన్నీ మేం చేస్తున్నాం. అయినా సరే ఓర్వలేక సంక్షేమ రాజ్యంపై విమర్శలు చేస్తున్నారు. ఇవాళ సంక్షేమ పథకాల అమలుతో జీవన ప్రమాణాలను మెరుగుపరిచాం. ప్రజలు హాయిగా జేవించేలా చేస్తున్నాం. రాజ్యాంగం చెప్పినట్టుగా మీ జీవన ప్రమాణాలు పెంచుతున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాల్లో ఏ పనీచేయని వాళ్ళు, ఎవరి వృద్ధినీ పట్టించుకోని వారు ఇది అభివృద్ధి కాదు అని విమర్శలు చేస్తున్నారు. ఇది సబబు కాదు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారి జీవన ప్రమాణాలు పెరిగిన నాడే అభివృద్ధి అంటారు. ఇంతక ముందు పనిచేసిన నాయకులు పాలన చేసిన నాయకులు ఎందుకు ప్రజలు జీవన ప్రమాణాలు పెంచలేదు ? అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు వారి కనీస అవసరాలు తీర్చలేదు అని ప్రతిపక్షాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇవి చేయొద్దు అన్నవారికి మళ్ళీ అధికారం ఇస్తే..చేస్తారా ? ఇక్కడి గ్రామంలో తాగునీటి సమస్యను కొద్ది రోజుల్లో తీర్చేందుకు కృషి చేస్తాను. అలానే ఇవాళ 12 వేల కోట్ల రూపాయలు వెచ్చించి భూమి కొని 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాము. చంద్రబాబు ఒక్క ఎకరా అయినా కొన్నారా ? ఇవాళ 15 లక్షల మందికి ఇల్లు మంజూరు చేశాము. మీకు ఇచ్చిన ఇళ్ళ స్థలాల లో మౌలిక వసతులు కల్పించి మీకు అందిస్తున్నాము. ఇవాళ మీరు పేదరికం కారణంగా ఎవరి మీద ఆధార పడకుండా మీ బిడ్డలకు మంచి చదువు అందిస్తున్నాం. వారికి బుక్స్, షూస్, యూనిఫాం, బెల్ట్ ఇస్తున్నాము. ఇంటికి భారం కాకుండా అమ్మ ఒడితో అండగా ఉంటున్నాము. ప్రజలు గౌరవంగా బతికే విధంగా పథకాల ద్వారా అందించే ఆర్థిక లబ్ధి నేరుగా వారికే అందేవిధంగా, వారి ఖాతాలకే జమ అయ్యే విధంగా పని చేస్తున్నాం. గౌరవంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నాము. మీరు ఎవ్వరి దగ్గర మోకరిల్లాల్సిన పని లేకుండా మీ హోదా పెంచుతున్నాం. మీ గౌరవం పెంచుతున్నాం. మీకొక సామాజిక భద్రత, ఆర్థిక భరోసా నిరంతరం ఈ నాలుగేళ్లలో అందేవిధంగా అహరహం శ్రమిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. డబ్బులన్నవి పేదలకు పెంచడం మంచిది పని కాదు అంటున్నారు విపక్ష నేత చంద్రబాబు. ఒక్కసారి గమనించండి. పరిపాలనను ఇవాళ మీ గ్రామానికే తీసుకు వచ్చాము. మీ అవసరాలు గంటల్లో తీరనున్నాయి. ఆ విధంగా సచివాలయ వ్యవస్థను రూపుదిద్దుకుంది. అదేవిధంగా స్థానిక సమస్యలు కొన్ని ఇవాళ నా దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ సమస్యను నా దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడాను. ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి త్వరలోనే సమస్య పరిష్కానికి చొరవ తీసుకుంటారు. అలానే ఇంకేమయినా సమస్యలు ఉంటే సచివాలయ సిబ్బంది ద్వారా కానీ స్థానిక నాయకత్వం ద్వారా కానీ నా దృష్టికి తీసుకు వస్తే నేను పరిష్కరిస్తాను..మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతుగా నిలవాలని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బోర చిన్నం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.