చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు 

గతంలో మోదీని విమర్శించి ఇప్పుడు కాళ్లు పట్టుకున్నాడు,

ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధం,

వాలంటీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి,

చంద్రబాబు, ప్రతిపక్షాలకు ఇవే చివరి ఎన్నికలు,

ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాజాం ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్  

రాజాం : టీడీపీ అధినేత చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్ విమర్శించారు. గతంలో వాలంటీర్లను కించపరచిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి మాయమాటలు చెబుతున్నారని అన్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతకవిటి మండలంలో సంతకవిటి, చిన్నయ్య పేట,కాకరాపల్లి, మందరాడ అక్కరపల్లి పంచాయతీలలోని ‘ఇంటింటికీ వైయ‌స్ఆర్‌సీపీ’ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు, రాజాం  నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన కరపత్రాలను అందజేసి రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి, విజయనగరం ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 

ఈ సందర్భంగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు.మేం ఎక్కడికి వెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తూ తాము జగన్‌ వెంటే ఉన్నామని అంటున్నారు. ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారు.గతంలో వాలంటీర్ల వ్యవస్థను కించపరచిన చంద్రబాబు ఈ రోజు వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చంద్రబాబు తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. 1వ తేదీన ఇంటి వద్దకే అందాల్సిన పింఛన్‌ను అడ్డుకున్న ఘనత చంద్రబాబుదని ప్రజలే అంటున్నారు.

గతంలో వాలంటీర్ల అంతు చూస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ఊసరవెల్లి కూడా మార్చలేని రంగులను చంద్రబాబు మారుస్తున్నారు. గతంలో మోదీని విమర్శించిన చంద్రబాబు ఈ రోజు మోడీ కాళ్లు పట్టుకున్నాడు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తాం’’ అని తెలిపారు. ‘‘2019లో అధికారం కోల్పోయాక చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలకు దూరంగా ఉన్నారు. కోవిడ్‌ సమయంలో ఎక్కడా కన్పించలేదు. ఈ రోజు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి తలుపు తడుతున్నారని చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారు. మొన్నటి వరకు వాలంటీర్లను తిట్టి ఈ రోజు ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు వాలంటీర్లకు ముందుగా క్షమాపణ చెప్పాలి. వాలంటీర్లను చూస్తే గుర్తుకు వచ్చేది జగనే. అవ్వాతాలకు పింఛన్లు కూడా ఇవ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు. గతంలో మహిళా సంఘాల రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు వారిని మోసం చేశాడు. ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు. వాలంటీర్లకు రూ.10 వేలు కాదు రూ.50 వేలు ఇస్తామని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు, మిత్రపక్షాలకు ఇవే చివరి ఎన్నికలు. గతంలో టీడీపీకి వచ్చిన సీట్లు కూడా ఈసారి రావు అని ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌ సిరిపురపు జగన్ మోహన్ రావు, ఆయా గ్రామాలు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top