అలా చేయ‌డం అన్యాయం కదా బాబన్నా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: కార్యకర్తలు చట్టాన్ని ధిక్కరించి జైలుకు వెళ్తే అధికారంలోకి వచ్చాక స్వాతంత్ర సమరయోధుల తరహాలో పెన్షన్లు, సౌకర్యాలు కల్పిస్తావా? అన్యాయం కదా బాబన్నా? అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమాయకులను జైళ్లకు పంపి మీ తండ్రీకొడుకులు తమాషా చూస్తారా! ఆ త్యాగాలేవో మీరే చేయొచ్చు కదా. కుల మీడియా ఫుల్ కవరేజి ఇస్తుంది అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ప‌చ్చ మంద బాబు ప‌రువు తీస్తోంది
1995కు ముందు దేశంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో కంప్యూటర్ మీద బాబు ఏం పని చేసాడబ్బా? వీడియో క్యాసెట్లు వేసుకుని చూసేవాడా? అప్పటిదాకా కంప్యూటర్లు పరిశోధనా సంస్థలో తప్ప మిగతా చోట్ల అలంకారప్రాయాలే. పచ్చ మంద ప్రచార విభాగం ముసలాయన నాయుడు బాబు పరువు తీస్తోంది అంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top