డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 
 

 అమరావతి: 'చంద్రబాబు యస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.  రూ. 1,300 కోట్ల  టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడని పేర్కొన్నారు.  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. యస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై  ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు.  యస్‌ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?' అంటూ ధ్వజమెత్తారు. ఇందుకు ఆధారంగాగా ఆయన యస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను కూడా  పోస్ట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top