విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు దీక్షల పేరుతో చేసిన డ్రామాను వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. అమరావతికి కూతవేటు దూరంలో నలుగురు కార్యకర్తలు, 40 మంది పచ్చ మీడియా ప్రతినిధులతో దీక్షాదక్షుడు! ఇంకా క్లారిటీ రాలేదా చంద్రబాబు? కరకట్ట కొంప వెనుక కృష్ణా నదిలో మూడు మునకలేసి రాజకీయ సన్యాసం తీసుకో. చరమాంకంలో ఈ చమక్కులేంటి? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం దేవాలయాన్ని రెండుసార్లు సందర్శించారని ఆలయంలో శాసనాలు చెప్తున్నాయి. స్వామి వారికి ఆయన ఎన్నో అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. పర్వదినాలోనయినా స్వామిని అలంకరించి భక్తుల సందర్శనకు పెట్టావా అశోక్ గజపతి? లేక వాటిని కూడా కుప్పం నాయుడుకు కప్పం కింద కట్టేశావా? అంటూ మరో ట్వీట్ చేశారు. 50 ఏళ్ల రాజకీయ అనుభవం, మహారాజునంటాడు. విజయనగరం జిల్లాకు ఒక్క యూనివర్సిటీ తేలేకపోయాడు.50 ఏళ్లు వయసు లేని సీఎం గారు యూనివర్సిటీ ఏర్పాటుచేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం, ట్రస్టు భూముల్ని అమ్మేయడం, సమస్యను జఠిలం చేయడంలోనే అశోక్ గజపతుల వారు అర్థ శతాబ్దం బిజీగా గడిపాడు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.