సిద్ధం సభలకు అనూహ్య స్పందన

రెట్టింపు ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు

అద్దంకి వద్ధ పచ్చికలగుడిపాడు సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు హాజరు..

అద్దంకి సిద్దం సభను విజయవతం చేస్తాం

నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్థి పేర్లు త్వరలో ప్రకటన

మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించే సిద్ధం మహాసభలకు ప్రజల నుండి అనూహ్య రీతిలో స్పందన లభిస్తోందని, మార్చి 3న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం,కొర్సిపాడు మండలం, పిచ్చికలగుడిపాడు గ్రామం, జాతీయ రహదారి పక్కన జరగనున్న చివరి సిద్ధం మహాసభకు 15 లక్షల మంది వరకు హాజరు కానున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం  నెల్లూరు పార్టీ కార్యలయంలో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,పార్టీ రీజనల్ కోఅర్డీనేటర్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయన చర్చించారు. 

 అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు లో జరిగిన సిద్ధం సభకు 10 లక్షల మంది హాజరయ్యారని తెలిపారు.  భీమిలి, ఏలూరు, రాప్తాడులో జరిగిన సిద్ధం సభలు విజయవంతంగా పూర్తయ్యాయని అన్నారు. ఊహించని విధంగా ప్రజల నుంచి స్పందన లభించిందని అన్నారు. శనివారం బాపట్ల, పల్నాడు, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ  నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించామని మొత్తం 6 పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి అద్దంకి సిద్ధం మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 3 తేదీన జరగనున్న సిద్ధం సభలో సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. 

గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ప్రజలకు అందించిన సుపరిపాలన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి అమలు చేసిన పథకాలు, అందించిన భరోసా అలాగే రానున్న 5 సంవత్సరాల్లో ఏమేమి చేస్తామన్నది ప్రజలకు సవివరంగా వివరిస్తారని అన్నారు.ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి పేర్లు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా శతర్ చంద్రారెడ్డి పోటీ చేస్తారన్నది సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం మాత్రమేనని అటువంటిదేమీ లేదని కొట్టిపారేశారు. పార్లమెంట్ అభ్యర్దిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడిని కూడా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల ముందు కొందరు పార్టీలను వీడడం, మరికొందరు పార్టీల్లో చేరడం సర్వసాధారణమని, దీనిని బూతద్దంలో చూడకూడదని అన్నారు. పార్టీలను వీడడానికి, కొత్త పార్టీల్లో చేరడానికి అనేక కారణాలు ఉంటాయని అన్నారు.   

వైయ‌స్ఆర్‌సీపీ విధివిధానాలకు కట్టుబడి ఉంటుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పార్టీ    వైఎస్సార్సీపీ  అని అన్నారు. అలాగే అగ్రవర్ణాల్లోని పేదల ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలనూ కాపాడుతోందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రం రెడ్డి,   కిలివేటి సంజీవయ్య,అన్న రాంబాబు, నాగార్జున రెడ్డి,ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి,పార్టీ సమన్వయకర్తలు పాల్గొన్నారు..
 

Back to Top