న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్లు వెదజల్లుతోంది

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

 తాడేప‌ల్లి:  న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్ల రూపాయలను వెదజల్లుతోందని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి విమర్శించారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  
‘న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా? మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురంధేశ్వరి గారు?. వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా?’ అని ప్రశ్నించారు. 

అలాగే, ‘ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లీడర్లు. వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది’ అంటూ విజ‌యసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Back to Top