తాడేపల్లి: దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లు అని ఎగతాళి చేసిన బాబుకు రాజకీయ సమాధికడతామని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నందిగం సురేష్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. *దళితుల పట్ల మరోసారి చంద్రబాబు అహంకారంః* రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవమున్న నాయకుడిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఎస్సీల పట్ల తనకున్న భావాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మీటింగ్‌లో ఒక ఎస్సీ నాయకుడి గురించి ఏం మాట్లాడారో అందరం చూశాం. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. (శింగనమల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గురించి చంద్రబాబు ఏమన్నారో.. ఆయన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపారు) ఎస్సీలను ఉద్దేశించి ఇదే చంద్రబాబు గతంలో ఏమన్నారు...? ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటూ ఎస్సీలను తీవ్రంగా అవమానించా డు. ఇవాళేమో.. ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లు టిప్పర్ డ్రైవర్‌లంటూ ఎస్సీ నాయకుడి గురించి ఎగతాళిగా మాట్లాడాడు. చంద్రబాబు అనే వ్యక్తి నీచ సంస్కృతి కలిగిన వాడనేందుకు ఇంతకన్నా వేరే నిదర్శనమేదీ లేదు. ఏంటి .. ఆయన అహంకారం..? ఎస్సీలు రాజకీయ నాయకులుగా ఎదగకూడదని ఆయన భావించడం చాలా బాధాకరం. *బాబు రక్తంలోనే కులపిచ్చిః* గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే చంద్రబాబుకు కులపిచ్చి కొనసాగుతూనే ఉంది. అది ఇక ఎప్పటికీ ఆయన్నుంచి పోయేది కాదు. ఎందుకంటే, కుల పిచ్చి అనేది ఆయన రక్తంలోనే ఇమిడిపోయి ఉంది. సామాన్యుడైన ఒక దళితుడు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటే.. ఆ పేదవాడిని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి పిలిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటిస్తే.. చంద్రబాబుకు మాత్రం ఆ దళితుడి పట్ల అంత చిన్నచూపా..? జగన్ గారి నిర్ణయం పట్ల మీకెందుకంత చులకన భావం..? అంటే, నీ దృష్టిలో దళితులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పనికిరారా..? నీ జీవితంలో ఎన్ని సార్లు దళితులను అదేపనిగా అవమానిస్తావు..? *దళితులు.. డ్రైవర్లంటే అంత చిన్నచూపా..?ః* దళితులకు రాజకీయ పదవులొస్తే నీకెందుకు అంత కడుపుమంట..? డ్రైవర్ల పట్ల మీకెందుకంత చిన్నచూపు..? టిప్పర్‌డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు దేనికీ పనికిరారనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మరి, రాష్ట్రంలో ఆటోడ్రైవర్లుగా.. టిప్పర్‌డ్రైవర్లుగా లక్షల మంది పనిచేస్తున్నారు. ఆఖరికి, చంద్రబాబుకు, లోకేశ్‌కు, ఆయన కోడలి కార్లు నడుపుతున్నవారంతా డ్రైవర్ల వ్యవస్థ నుంచి వచ్చినవారే కదా..? వాళ్లు లేకపోతే.. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలకు ఒక్క పూట గడవదనే సంగతి అందరికీ తెలుసు. ఆర్టీసీ గానీ.. ఇతర ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలైనా ప్రతీరోజూ డ్రైవర్ల మీద ఆధారపడే ముందుకు నడుస్తూ ఉన్నాయి. అంతటి గొప్పదిగా డ్రైవర్ల వ్యవస్థను మనమంతా గుర్తించాల్సిందే. అలాంటి గొప్ప డ్రైవర్లను పట్టుకుని.. అందునా ఒక దళిత నాయకుడ్ని ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లంటూ చంద్రబాబు ఎగతాళి చేస్తున్నాడు. *నీకులాగ వెన్నుపోట్లు, మోసాలు మాకు తెలియవుః* చంద్రబాబు ఒక సంగతి గుర్తించాలి. నీకులాగా మోసాలు చేయడం, వెన్నుపోటు పొడవడమనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకో.. డ్రైవర్ల వ్యవస్థలో పనిచేసేవారికో ఎవరికీ తెలియదు. నీలాంటి నీచ సంస్కృతికి మేం ఆమడదూరంలో ఉంటాం. నీకులాగా తిరుపతిలో జేబులు కొట్టి బతకడం మావల్ల కాలేదు. నమ్మినోడిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని సొంత తమ్ముడ్ని ఇంట్లో కట్టేసి చిత్రహింసలు పెట్టే కిరాతకులం మేం కాదు. వెన్నుపోట్లు, మోసాలు నీ పేటెంట్ హక్కులని అందరికీ తెలుసు. *నీ కులంలో పుట్టిన నీ తండ్రే గొప్పోడా..?ః* చంద్రబాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. నీ తండ్రి ఏం చేశాడు..? అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ నడపలేదు కదా..? చిన్న రైతుగా వ్యవసాయం చేసినోడే కదా..? మరి, అతను వేలిముద్రతో పుట్టలేదా..? మరి, నీ కులంలో పుట్టినోడు గొప్పోడు ఎలా అయ్యాడు..? మా ఎస్సీల్లోనో.. ఎస్టీల్లోనే పుట్టినవాడు వేలిముద్ర వేసే వ్యక్తిగా ఎలా తక్కువయ్యాడో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చినోడివి ఇవాల్టికి రూ.6 లక్షల కోట్లు ఎలా సంపాదించావు...? నీ బతుకే 420 బతుకుని గూగుల్‌లో కొట్టినా తెలుస్తోంది. *నీ కంచంలో కూడు లాక్కోలేదుగా..?ః* ఎవరో పెట్టిన రాజకీయ పార్టీని వెన్నుపోటుతో లాగేసుకోవడం.. ఎవరో డబ్బు పెడితే నీ కొడుకును విదేశాల్లో చదివించుకోవడం.. మోసాలు, దగాలు చేసి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికార పీఠం ఎక్కడం.. వంటి నీచసంస్కృతి ఏనాడూ మా దళితుకు తెలియవు. మా రక్తంలో కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు ఉండవు. మా జీవితాలను మొదట్నుంచి నువ్వు ఎక్కిరిస్తూనే ఉన్నావు. ఏనాడైనా.. చీమూనెత్తురు ఉన్నోడైతే, మాపట్ల గౌరవం మర్యాదగా మసలుకుంటాడని ఆశిస్తే.. అవేమీ లేనోడిగా బతుకుతున్న నీచపు కుక్క ఈ చంద్రబాబు. నీ కంచంలో కూడు మేం ఏమైనా లాక్కున్నామా..? టిప్పర్ డ్రైవర్‌గా పనిచేసినా.. వేలిముద్ర వేసేవాడైనా మా ఎస్సీ అభ్యర్థి తన కష్టంతో తన కూడు తాను తింటున్నాడు తప్ప.. నీకులాగా ఇతరుల కూడును లాక్కుని తినడం లేదు. నీ దగ్గర పనిచేసే కొండల్‌రెడ్డి అనే డ్రైవర్ ఎందుకు చనిపోయాడో.. ఎలా చనిపోయాడో సమాధానం అడిగితే చెప్పలేని వ్యక్తి ఈ చంద్రబాబు. *మాకు తెలిసిందల్లా నీతిగా బతకడమే..ః* రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులేసి నీకులాగా పదవుల్ని ఆక్రమించుకోవడం మాకు తెలియదు చంద్రబాబూ.. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తెలిసిందల్లా నీతిగా బతకడమే. కాయాకష్టం చేసుకుని పనిచేసే దగ్గర పని ఇచ్చిన వ్యక్తి దగ్గర నమ్మకంగా ఉండటమే మాకు తెలుసు. నీలాంటి నీచ సంస్కృతిని నీ కొడుకు లోకేశ్‌కు నేర్పుకున్నావేమో.. అతను కూడా నిన్నేం మించిపోడు. లోకేశ్ అనే వ్యక్తి ఒక హాఫ్‌నాలెడ్జ్ ఫెలో.. నువ్వు నేర్పిన బుద్ధులతోనే మాట్లాడుతాడు గానీ.. మా తల్లిదండ్రులు మాత్రం అలాంటి వాటిని మాకు నేర్పలేదు. *నువ్వు కించపరిచినోళ్లే..నిన్ను నిలదీస్తారు చూడుః* నందమూరి కుటుంబాన్ని చేతిలో బొమ్మల్లాగా ఆడిస్తూ తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని ఇన్నాళ్లూ దళిత, బీసీ, మైనార్టీల సొమ్ముతో బాగుపడ్డావు. అధికారం తలకెక్కి నీ వాపును బలుపనుకుంటున్నావు. ఇన్నాళ్లకు నీకు దళితులు, డ్రైవర్లు వేలిముద్రగాళ్లుగా కనిపిస్తున్నారేమో.. రేపటికి.. అదే వేలిముద్రగాళ్లు నాయకులుగా అసెంబ్లీలోనో.. మరెక్కడ్నో.. నిన్ను నిలదీసే పరిస్థితి వస్తుంది చూసుకో.. ఇవాళ, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావో.. వాటన్నింటికీ, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని రాసిపెట్టుకో చంద్రబాబు. *పేదోడి పట్ల జగన్ గారి ప్రేమ అదిః* ఇదే అమరావతి ప్రాంతంలో ఒక సామాన్య ఎస్సీ కార్యకర్తను నువ్వు కించపరిస్తే.. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం అదే వ్యక్తిని ఎంపీని చేశారు. ఆ వ్యక్తే నందిగం సురేష్ అనే నేను. పేదోడి పట్ల శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమ అది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద కుటుంబాల్లో పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెట్టాలని సంకల్పించి పనిచేస్తున్నారు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనకు కులాలు, మతాలతో సంబంధం లేదు. ఏనాడూ ఆయన మమ్మల్ని చులకనగా చూడలేదు. చిన్నబుచ్చినట్లు ఎక్కడా పల్లెతు మాటా అనలేదు. అలాంటి గొప్ప నేతల పక్కన దళితులు, బీసీలు, మైనార్టీలు ఉంటారు. నీ బతుక్కి నీ హయాంలో ఏనాడైనా పేదోడి పిల్లోడు ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఆ వేదికపై మాట్లాడిన సందర్భం ఉందా..? అదే మా జగనన్న గడచిన నాలుగున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని కాపాడారు. కాబట్టే.. ఆయన్ను జీవితాంతం మా వర్గాలు గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా పూజిస్తాయి. రేపటి ఎన్నికల్లో మేమంతా ఆయన్నే మరోమారు సీఎంగా చూసుకుంటాం. ఇది తథ్యం. *నీ రాజకీయ సమాధి మా చేతుల్లో ఖాయంః* ఒకటికి పలుమార్లు మమ్మల్ని చులకన భావంతో మాట్లాడుతుంటే.. నీకు రాజకీయ సమాధి కట్టాలని దళితులంతా పూనుకుంటుంటే.. నీలో మా పట్ల రోజురోజుకూ అక్కసు పెరుగుతోంది. ఇది మేం గ్రహించాం. ఆయన అహంకారానికి భవిష్యత్తులో తప్పకుండా మేం సమాధానమిస్తాం. రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు శాశ్వత రాజకీయ సమాధి ఖాయమని చెబుతున్నాం. టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబు అహంకార ధోరణిని గ్రహించి ఆయన్ను నిలదీయాలని కోరుతున్నాను.