దీక్షలో ఉండి అలవోకగా అబ‌ద్ధాలు ఎలా చెప్ప‌గ‌లుగుతున్నారు?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఎంపీ మిథున్‌రెడ్డి ఆగ్ర‌హం
 

చిత్తూరు:  డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఎంపీ మిథున్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకా ఎంత‌కాలం మాపైవ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతార‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఎంపీ ట్వీట్ చేశారు.
పవన్‌కళ్యాణ్‌గారు.. దీక్షలో ఉండి కూడా ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. మీరు అధికారంలో ఉన్నారు. పోలీసులు, వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడే కాదు.. పాతిక సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమరవాణాపై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. చివరకు సత్యశోధన పరీక్షకైనా నేను రెడీ. ఐదేళ్లపాటు మీకు సమయం ఉంది. ఆరోపణలను నిరూపించలేకపోతే బహిరంగంగా మీరు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా? అంటూ ఎంపీ మిథున్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top