స్థానిక ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం

తాగుబోతుల సంఘాలకు అధ్యక్షుడిలా బాబు ప్రవర్తిస్తున్నారు. 

అది టీడీపీ పార్టీ ఆఫీసా..? మద్యం దుకాణమా?

టీడీపీ నేతలు మద్యం కమీషన్లకు బానిసలయ్యారు

హెల్త్‌ డ్రింక్‌గా మద్యాన్ని ప్రమోట్‌ చేసిన చరిత్ర టీడీపీది

43 వేల బెల్ట్‌షాపులు రద్దు చేసిన చరిత్ర వైయస్‌ జగన్‌ది

ప్రజల కోసం పని చేస్తున్న సీఎంపై విమర్శలు చేయడం దారుణం

వాలంటీర్ల వ్యవస్థ వారియర్స్‌లా పని చేస్తోంది

ఎమ్మెల్యే ఆర్కే రోజా

తాడేపల్లి: టీడీపీ నేతలు తాగుబోతు సంఘాలకు అధ్యక్షులుగా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తీరు మార్చుకోకపోతే త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.  వైయస్‌ జగన్‌ మద్యపాన నిషేదం చేసి తీరుతారని ఆమె పేర్కొన్నారు. మంచి చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు.

టీడీపీ నేత బొండా ఉమా పెట్టిన ప్రెస్‌మీట్‌ చూస్తే చాలా సిగ్గుచేటు అనిపిస్తోంది. తన ముందర బ్రాండ్స్‌ పెట్టుకొని ఏదో వైన్‌ షాపులో సెల్స్‌ మెల్స్‌లా మాట్లాడారు. కళ్లుతాగిన కోతి ఏవిధంగా ప్రవర్తిస్తోందో..ఇవాళ టీడీపీ నేతల ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఈ రోజు టీడీపీ ఆఫీస్‌లోనే బాటిల్స్‌ పెట్టుకొని ప్రెస్‌మీట్లు పెడుతుంటే..అవి టీడీపీ ఆఫీసా? లేక లోకేష్‌ వైన్‌షాపా?. అది పార్టీ ఆఫీసా..చంద్రన్న బెల్ట్‌షాపా అన్నది అందరికి డౌట్‌ వస్తోంది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యానికి బానిస అయిన వారిని డి ఎడిక్షన్‌ సెంటర్లకు పంపించి బాగు చేయాలనుకున్నాం. కానీ ఈ రోజు మద్యానికి బానిసై కొట్టుకుంటున్న టీడీపీ నేతలందరికీ డీ ఎడిక్షన్‌ సెంటర్లకు పంపించి నయం చేయాల్సిన అవసరం ఉంది. తొమ్మిది నెలల నుంచి చూస్తున్నాం. ప్రతిపక్ష నేత కూడా బ్రాండ్స్‌ లేవు..టైం పెంచాలని అంటున్నాడు. ఆయన్ను చూస్తుంటే ప్రతిపక్ష నేతగా కనిపించడం లేదు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారు. ఈ రోజు చంద్రబాబుకు సూటిగా సవాలు చేస్తున్నా..మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా 43 వేల బెల్ట్‌షాపులను రద్దు చేసిన ఘనత ఉందా? వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక 43 వేల బెల్ట్‌షాపులు రద్దు చేశారు.ఇవాళ మహిళలంతా వైయస్‌ జగన్‌కు హాట్సాప్‌ చెబుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వైన్స్‌ షాపులు తగ్గించాలని ఆలోచన చేశారా? కానీ సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం 20 శాతం వైన్‌ షాపులు తగ్గించారు. 40 శాతం బార్లను తగ్గించిన ఘనత వైయస్‌ జగన్‌ది.  మీకు వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత ఉందా? . మహిళల పసుపు కుంకుమల గురించి వైయస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.మంచి వ్యక్తిని విమర్శించడం దుర్మార్గం. చంద్రబాబు గత ఐదేళ్లలో మద్యాన్ని ఎలా ఎరులై పారించారో చూశాం. బెల్ట్‌షాపులను నిర్మూలిస్తానని చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఆ సంతకానికి విలువ లేకుండా పో్యింది. మహిళల తాళిబొట్లు తెగే విధంగా చంద్రబాబు పరిపాలించారు. వైయస్‌ జగన్‌ ఈ రోజు ఎలాగైనా ఈ మద్యాన్ని దూరం చేయాలని, ఆడవాళ్ల పసుపు కుంకుమలు కాపాడాలని మద్య పాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో నారా వారి పాలన సారా వారి పాలనలా ఉండేది. లిక్కర్‌ సిండికెట్‌తో రాష్ట్రమంతా దోచుకున్నది ప్రజలు మరిచిపోలేదు. అప్పట్లో మంత్రిగా ఉన్న జవహర్‌ హెల్త్‌ డ్రింక్‌ బీర్‌ అంటూ ప్రమోట్‌ చేశారు.  ఇలాంటి చంద్రబాబు ఈ రోజు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు.

వాలంటీర్లకు సెల్యూట్‌.
1వ తేదీన సూర్యుడి కంటే ముందుగానే ప్రతి వాలంటీర్‌ కూడా అవ్వాతాతలకు పింఛన్‌ ఇచ్చేందుకు వెళ్లారు. ఆసుపత్రుల్లో ఉన్న వారికి కూడా అక్కడికి వెళ్లి పింఛన్‌ ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ ఇచ్చిన వాలంటీర్లకు నిజంగా సెల్యూట్‌ చేస్తున్నా. వీరిని వాలంటీర్లు అనేకంటే వారియర్స్‌ అనవచ్చు. వైయస్‌ జగన్‌ పేదల కోసం పని చేయాలనుకుంటే..ఆ పని సక్రమంగా చేసి పెడుతున్న వారియర్స్‌ మా వాలంటీర్లు. చంద్రబాబు ఎవరికి వదలడం లేదు. చివరకు వాలంటీర్లను కూడా విమర్శిస్తున్నారు. ఎవరు లేనప్పుడు తలుపు తట్టారని వల్గర్‌గా మాట్లాడారు.  మద్యాన్ని డోర్‌ డెలివరీ చేశారని టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. డోర్‌ డెలివరీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు కూడా సిద్ధమే.
త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ నేతలు పిచ్చి మాటలకు, మీ ప్రవర్తనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు సార్వాత్రిక ఎన్నికల కంటే డబుల్‌గా ఛీత్కరిస్తారు. టీడీపీని తరిమికొడతారు. 
చట్టసభలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేతో బ్రాండ్‌ల గురించి చంద్రబాబు మాట్లాడించారు. అమాయక మహిళా ఎమ్మెల్యేతో మద్యం బ్రాండ్స్‌ గురించి మాట్లాడించడం బాధాకరం. మద్యం ధరలు పెరిగితే..ఏదో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు. ఫెయిడ్‌ ఆర్టిస్టులతో మద్యం, రాజధాని అంశాలపై వీడియోలు తీయించి యూ ట్యూబ్‌లో పెట్టిస్తున్నారు. మానసిక రోగులుగా మారి  ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ మహిళల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, వారి రక్షణ, సాధికారికత కోసం చేస్తున్న పనులను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అమ్మ ఒడి, నామినేటేడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకే రిజర్వేషన్లు, జగనన్న విద్యా దీవెన మహిళలకే  ఇచ్చారు. వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ గృహ వసతి కూడా మహిళలకే ఇచ్చారు. దిశ చట్టాన్ని తీసుకువచ్చి, పోలీసు స్టేషన్లు కూడా ఏర్పాటు చేశాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతుంది. ఈ రోజు రాష్ట్రంలోని మహిళలందరికీ వైయస్‌ జగన్‌ ఇచ్చిన నిజమైన కానుక ఈ మహిళా దినోత్సవం కాబోతుందని మహిళా ఎమ్మెల్యేగా, వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గర్వంగా చెబుతున్నాను. ఇప్పటికైనా బార్ల గురించి, బీర్ల గురించి మాట్లాడటం మానేసి పెద్ద మనసుతో రాష్ట్రానికి మంచి చేస్తున్న వైయస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమాలు చేసి ప్రజల్లో చులకన కావద్దని ఆర్కే రోజా సూచించారు.  మద్యం గురించి మాట్లాడేది మగవాళ్లు ఓట్లు వేస్తారనుకుంటే..ఆడవాళ్లు మీ బ్యాండ్‌ మోగిస్తారని రోజా హెచ్చరించారు. 
 

Back to Top