రాష్ట్రంలో దళిత, బహుజన సంక్షేమం విరాజిల్లుతోంది

వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
 

విజయవాడ:  సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో దళిత, బహుజన సంక్షేమం విరాజిల్లుతోందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో సామాజిక న్యాయం, పేద ప్రజల అభ్యున్నతి, వారి స్థితిగతులు మార్చాలని చాలా మంది గతంలో మాట్లాడారు. ఈ రోజు ఏపీ చరిత్రను సువర్ణ అక్షరాలతో రాయాలి. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో పేదల స్థితిగతులు మెరుగుపరుస్తున్నారు. రాజకీయ గౌరవం సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో విరాజిల్లుతోంది. దళితులు, బహుజనులకు సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా చేస్తామంటున్నారు. కార్పొరేషన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ మహానేతగా వైయస్‌ జగన్‌ ప్రజల్లో గుర్తింపు పొందారు. పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి పదవులు కట్టబెడుతున్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ వెంట నడవాలని, బాబా సాహేబ్‌ ఆలోచన విధానం రాష్ట్రంలో కొనసాగుతోంది. మంచి ఆలోచనతో సాగుతున్న పాలనలో మేం భాగస్వాములం అయినందుకు సంతోషంగా ఉంది. దళిత, బహుజన సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top