ఆ ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌దే

ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి

చెరుకుల‌పాడులో వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మం

 క‌ర్నూలు: అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని ప‌త్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి పేర్కొన్నారు. వెల్దుర్తి మండలం చెరుకులపాడు  గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్  కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొని జెండా, సంక్షేమ ప‌థ‌కాల బోర్డును ఆవిష్క‌రించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారు పొందిన లబ్ధిని వివరించారు. సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిగా గెలిపించుకుందామ‌ని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొన‌సాగేలా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఎమ్మెల్యే కోరారు. అనంతరం పాడి రైతుల పశువులకు వర్తించే వైయస్ఆర్ పశు బీమా పథకం, పాడి పశువులు మరణిస్తే నష్టపోయిన పశుపోషకులకు బీమా ప‌రిహారం చెల్లింపు కార్డును ఎమ్మెల్యే పాడి రైతులకు అందజేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కంగాటి వాసంతమ్మ, వెల్దుర్తి సింగల్ విండో ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి, సర్పంచ్ బోయ రాములమ్మ, వైస్ ఎంపిపి కురువ రాజేశ్వరి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top