‘జగనన్న ఆరోగ్య సురక్ష’తో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం

సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించారు

గుంటూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని

గుంటూరు: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరులో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మంత్రి రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సేవలు పొందేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నామని, పేద ప్రజల గడప ముందుకే వైద్య సేవలు తీసుకువచ్చామన్నారు. మెరుగైన వైద్యం కోసం రిఫరల్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో చాలీచాలని మౌలిక సదుపాయాలతో నిరుపేదలకు వైద్యం అందేది కాదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో గవర్నమెంట్‌ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించారని చెప్పారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top