చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు

వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి స‌మావేశంలో మంత్రి విడదల రజిని

విజ‌య‌వాడ‌:  చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశార‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని విమ‌ర్శించారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు.   సీఎం వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సురక్ష ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టామ‌న్నారు.

 రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా కావాల‌ని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజలంతా జగనన్నే మా నమ్మకం అంటున్నారని భాగ్య‌ల‌క్ష్మీ చెప్పారు.

 పాలనలో లోపాలను సరిదిద్దిన సంస్కర్త సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అని ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నార‌ని తెలిపారు.  ఏ ఇంటికి వెళ్లినా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top