తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

తిరుమల: అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజల దీవెనలు, తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని మంత్రి వెల్లంపల్లి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు.

తాజా వీడియోలు

Back to Top