ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ రోడ్లు

రోడ్లపై గత ప్రభుత్వం కంటే అధికంగా ఖర్చుపెడుతున్నాం

మంత్రి శంకర్‌నారాయణ

అమరావతి: ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు.  రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గురువారం సభలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వంపై కావాలనే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్‌ మాత్రమే చూపించారన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. రోడ్ల నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంద్రబాబు క్యాపిటల్‌ ఎక్సైండేచర్‌ కింద ఐదేళ్లలో కేవలం రూ. 13 వేల కోట్లు అయితే, మన ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలోనే రూ.11 వేల కోట్లకు పైగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రోడ్లకు ఖర్చు చేసిందని వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆయన అనుచరులకు లబ్ధి చేకూర్చారన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి అప్పు తీసుకొని రోడ్లకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి మండలం నుంచి గ్రామాలకు, ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు ఉండాలని ఎన్‌డీపీ తోడ్పాటుతో నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రతి విభాగంలో కూడా టెండర్లన్నీ కూడా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. టీడీపీ టెండర్ల రూపంలో ప్రజా«ధనాన్ని లూటీ చేశారని గుర్తు చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top