2024లో మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి జగనన్నే

మంత్రి ఆర్కే రోజా

తూర్పుగోదావ‌రి జిల్లా: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవుతార‌ని మంత్రి ఆర్కే రోజా ధీమా వ్య‌క్తం చేశారు. అది చూసి పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేరుతారు.. ఇది తథ్యమని ఆమె అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు.  
వ్యవసాయం దండగా అన్నా పెద్దమనిషి చంద్రబాబు అని.. వ్యవసాయం చేసుకునే వ్యక్తులను ఆత్మహత్య చేసుకునేలా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఇవాళ రైతులకు అండగా ఉండే విధంగా ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు అండగా ఉన్నది ఆనాడు మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, నేడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని చెప్పారు. ఇవాళ‌ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలతో భరోసా ఇచ్చింది వైయ‌స్ జ‌గ‌న్ అనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని మంత్రి రోజా హితవు పలికారు. 

Back to Top