తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సొంతింటి కలను నిజం చేశారని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం ఇంద్రపాలెం, చీడిగ,స్వామినగర్,కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారన్నారు. మహిళల పేర్లతో ఇళ్ల పట్టాలిస్తున్నామని తెలిపారు. సీఎం వైయస్ జగన్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలకే పరిమితమైతే సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇన్ని ఇళ్లు కట్టడం అంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందన్నది చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తాపీ మేస్త్రి మొదలు.. కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు.. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.