గ్రామ‌స్థాయి నుంచే మెరుగైన వైద్య‌సేవ‌లు

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభం

కృష్ణా: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య‌ రంగానికి పెద్దపీట వేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్ప‌త్రిలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.1600 కోట్లతో శిథిలావస్థలో ఉన్న ఆస్ప‌త్రుల‌ను పునర్‌ నిర్మిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. 

Back to Top