సీఎం వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి

పెట్టుబడిసాయం పెంచుతూ మరో కీలక నిర్ణయం

రూ.12,500 సాయం.. రూ.13,500 పెంచిన సీఎం

ఐదేళ్లలో రైతుభరోసా కింద రూ.67,500 సాయం

ప్రతి ఏడాది మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి..

వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పేరుతో పథకం

నవంబర్‌ 15 వరకు దరఖాస్తు గడువు పెంచుతూ నిర్ణయం

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు అనర్హులు

రైతు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా సాయం అందిస్తాం

అర్హత కలిగిన రైతు మరణిస్తే అతని భార్యకు పెట్టుబడి సాయం

రేపు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పథకం ప్రారంభం 

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి అని, రైతు సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ మరో వరం ప్రకటించారని, వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ఇస్తానని ప్రకటించిన రూ.12,500లకు మరో రూ.వెయ్యి జోడించి రూ.13,500 అందించాలని ఆదేశించారన్నారు. రైతు సంఘాల ప్రతినిధుల సూచన మేరకు పెట్టుబడి సాయాన్ని మూడు విడతలుగా అందించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ అని నామకరణం చేశారన్నారు. అగ్రికల్చర్‌ మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రులు కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. 

‘రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి, సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ను తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మొదటిరోజే ప్రకటించాం. 2017లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పాదయాత్రలో రైతాంగం బాధలు వెల్లబోసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుబడిసాయం అందిస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు రూ. 12,500 ఇస్తానని చెప్పిన హామీని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా.. రైతులను ఆదుకోవడం మన కర్తవ్యం అని భావించి ఈ ఏడాది నుంచి అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

రైతు భరోసా కార్యక్రమం రేపు నెల్లూరులో ప్రారంభం అవుతుంది. ఈ పథకానికి వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ అని సీఎం వైయస్‌ జగన్‌ నామకరణం చేశారు. ఏ ప్రభుత్వమైనా సరే. కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేసినప్పుడు దాన్ని సమీకృతపరిచి అమలు చేయడం అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ప్రక్రియ. కానీ సాదారణంగా కేంద్రం సాయం ఉన్నా అవి దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతాయి. కానీ, నాయకుడు విశాల దృక్పథంతో ఉండాలని ఆలోచనను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకొని ఈ పథకానికి పీఎం కిసాన్‌ యోజనను కూడా అనుసంధానం చేశారు. ఈ పథకం రేపు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. 

Read Also: చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌

అగ్రికల్చర్‌ మిషన్‌ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు పలు సూచన చేశారు. రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఒకేసారి కంటే రెండు విడుతలగా ఇస్తే బాగుంటుందని సూచన చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అవసరమైతే కొంత పెంచి సంక్రాంతి నాటికి రైతులకు సౌలభ్యంగా ఉండే విధంగా కొంతమొత్తాన్ని జతచేసి ఇస్తానన్నారు. పెట్టుబడిసాయం రూ.13,500 ఇవ్వడానికి సీఎం నిర్ణయించారు. దీన్ని ఖరీఫ్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇచ్చే విధంగా నిర్ణయించారు. ఇది చాలా గొప్ప నిర్ణయంగా భావిస్తున్నాం. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఖజానాను ఖాళీ చేసి, వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టి గత చంద్రబాబు ప్రభుత్వం వెళ్లిపోయిందని తెలిసిన విషయమే. అదనంగా భారమైనా.. ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని సీఎం ఈ ఏడాది నుంచి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమం రైతుల కోసం చేయాలంటే ధైర్యం కావాలి. మనస్సు, రైతు పట్ల ప్రేమ ఉండాలి. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతు కోసం వెనకడుగు వేయకుండా పథకాన్ని అమలు చేశారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌ పెట్టుబడి సాయం పథకాన్ని విస్తృతపరిచి, వ్యవసాయ రంగానికి కొత్త స్వరూపాన్ని తీసుకురావాలని కృషిచేస్తున్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఈ చర్యతో అర్థమైంది. 

నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానన్నది.. ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. దీంతో పాటు దేశంలో మొట్టమొదటిసారిగా కౌలురైతులకు మేలు చేసే కార్యక్రమం. పెట్టుబడిసాయం అందిస్తూ లక్షల మందికి తోడుగా ఉంటున్నారు. కౌలురైతులను గుర్తించి ఆలోచించిన సీఎం వైయస్‌ జగన్‌. రైతు ప్రతినిధులు చెప్పిన విధంగా మే నెలలో పంట కోతకు వచ్చే సమయంలో, రబీ అవసరాల కోసం, రైతు సంతోషంగా ఉండే సంక్రాంతి పండుగ రోజు ఇలా మూడు విడతలుగా ఇవ్వడానికి నిర్ణయించారు. దాదాపు 54 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. 

రేపు 40 లక్షల మందికి రైతు భరోసా పెట్టుబడి సాయం అందుతుంది. ఇంకా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోలేదు. డేటా సరిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి గడువు పెంచాలని చెప్పగానే నెలరోజుల పాటు పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ గడువు పెంచారు. నవంబర్‌ 15వ తేదీ వరకు అర్హత కలిగిన రైతులు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో, ఎమ్మార్వో, ఎండీఓ, కలెక్టర్‌ కార్యాలయాల్లో డిస్‌ప్లే చేయమని సీఎం ఆదేశించారు. 

గత ప్రభుత్వం 43 లక్షల మంది రైతు కుటుంబాల జాబితాను పీఎం కిసాన్‌ జాబితాకు సమర్పించినట్లుగా లెక్కలు ఉన్నాయి. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దాదాపు 3.5 లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందడానికి అనర్హులుగా తేలుతుంది. గత ప్రభుత్వ చర్యతో అర్హత ఉండి 6 లక్షల మంది ఈ పథకంలో ప్రయోజనం పొందలేకపోయారని తేలింది. ఈ డేటాను పరిశీలించి అర్హులందరికీ పెట్టుబడి సాయం అందేలా చూడాలని సీఎం సూచించారు. ఈ పథకంతో 3 లక్షల మంది కౌలు రైతులు లబ్ధిపొందనున్నారు. కౌలు రైతులు ఇంకా నమోదు చేసుకోకపోతే నవంబర్‌ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే ఏడాదికి కౌలు రైతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది.

ఇంతకు ముందు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనర్హులుగా తేల్చి నిబంధనలు పెట్టారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌లుగా వ్యవహరించిన వారికి కూడా ఈ పథకం వర్తించేలా చూడాలని సీఎం నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వీరంతా అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన వారిని అర్హులుగా చేర్చాలని చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాలు మార్పు చేయాలని సీఎం చెప్పారు. అక్వా కల్చర్‌ కింద మారిన భూములు, రియలెస్టేట్‌ కింద మారిన భూములను తొలగించాలి. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి ఆదాయ పన్ను కట్టేవారిని అనర్హులుగా ఇంతకు ముందు నిర్ణయించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1.37 లక్షల మంది రైతులు రైతుభరోసా పథకానికి అర్హత ఉండి చనిపోయినట్లుగా తేలింది. అలాంటి రైతుల భార్యలకు సాయం అందించాలని సీఎం సూచించారు. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి.. లేదా మరొక ఉద్యోగం చేసుకుంటుంటే ఆ తల్లిదండ్రులు గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటే అలాంటి వారిని దీన్ని నుంచి మినహాయించవద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top