రాజన్న ఆశయం జగనన్న పాలనలో నెరవేరుతోంది

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

కర్నూలు: పేద‌ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి.. ప్ర‌జ‌లంతా ఆరోగ్యంగా ఉండాలి.. రైత‌న్న‌లు సంతోషంగా ఉండాలి.. విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల‌నే.. మహానేత రాజన్న ఆశయాలు జననేత సీఎం వైయస్‌ జగన్‌ పాలనతో నెరవేరుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఎనిమిది నెలల పాలనలోనే నవరత్నాల్లో ఎనిమిది పథకాలను అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగనన్న వెంటే ఉన్నారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో 60 శాతం స్థానం కల్పించారు. బీసీలకు అండగా నిలిచే నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ఇతర రాష్ట్రాలు కూడా సీఎం వైయస్‌ జగన్‌ పాలనకు ఆకర్షితులవుతున్నారు.నవరత్నాలను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

తాజా వీడియోలు

Back to Top